Priyanka Chopra: సెలెబ్రిటీల జీవితాల్లో డేటింగ్ అనేది చాలా కామన్. కొందరు తమ రిలేషన్స్‌ను రహస్యంగా ఉంచితే.. ఇంకొందరు పబ్లిగ్గా బయటపెడుతుంటారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తాజాగా తన రిలేషన్స్ గురించి ఓపెన్ అయ్యింది. పెళ్ళికి ముందు తాను చాలా మందితో డేటింగ్ చేసినట్టు చెప్పింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అంతా చాలా మంచివారని, ఎంతో గొప్పవారని తెలిపింది.
‘‘నేను గతంలో చాలా మందితో డేటింగ్ చేశా. ఒక బంధం నుంచి మరో బంధానికి మారుతూ వచ్చాను. బంధానికి, బంధానికి మధ్య ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. నా సహచర నటులతో, సెట్‌లో నాతో కలిసి పనిచేసిన కొందరితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్‌షిప్ ఎలా ఉండాలనే దానిపై నాకు ఒక ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా..? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను. చాలా గొప్ప వ్యక్తులతో నేను డేటింగ్ చేశాను. కొందరితో ఆ బంధాలు విషాదంగా ముగిసి ఉండొచ్చు. కానీ నేను నా జీవితంలో డేటింగ్ చేసిన వారు నిజంగా చాలా మంచి వారు. ఎంతో అద్భుతమైన వ్యక్తులు’’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. నిక్ తన జీవితంలోకి రావడం కంటే ముందు రెండేళ్లు ఎలాంటి రిలేషన్ షిప్‌లోనూ లేనని చెప్పింది ప్రియాంక.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో.. కొన్నేళ్ల డేటింగ్ తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022లో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్ళైన తరువాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే ఉంటోంది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.