నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అఖండ సినిమా నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగు పెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో పక్కా లెక్కల తో ముందుకు వెళుతున్నాడు. ఆ తర్వాత చేసినా రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అనే ధీమాలోనే ఉన్నారు ఫ్యాన్స్. దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి బాలకృష్ణ కష్టపడుతున్నారు.
వాస్తవానికి ఎన్నికలు లేకపోతే ఈ సినిమా ముందుగానే విడుదలయ్యేది. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో కూడా సీతారామ ఎంటర్టైన్మెంట్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. నందమూరి అభిమానులను ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నిర్మాత సూర్యదేవర నాగావంశీ చేస్తున్న కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన వంశీ… బాలకృష్ణ మాస్ హీరో అని… ఆయన దృష్టిలో పెట్టుకొని కథ రాశారంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.
ఆయనకు తగిన ఎలివేషన్స్ అన్నీ ఉంటాయని… ఇప్పటివరకు సినిమాలో సర్ప్రైజ్లు ఏమీ రివీల్ చేయలేదని ఆయన డేకాయిట్ గా మారే ఎలివేషన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని… సినిమాల ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతాలా వీళ్ళ ముగ్గురితో బాలకృష్ణ ఎమోషనల్ సీన్స్ ఉంటాయని… బాలకృష్ణ సినిమాలో చాలా కొత్తగా కనపడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు వంశీ చేస్తున్న కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. బాబి కొల్లి వాల్తేరు వీరయ్య సినిమా కంటే డాకు మహారాజ్ సినిమా బాగా తీశారని మెగా ఫాన్స్ కోపం వచ్చినా సరే ఆ సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంటుందంటూ కామెంట్ చేశారు.
అలాగే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతూ ఒక నిర్మాత సినిమా టికెట్ ధరను అతడు పెట్టిన ఖర్చును బయ్యర్లకు అమ్మిన ఆధారంగా చేసుకుని నిర్ణయించుకుంటాడని… దేవర విషయం నాకు ఇంత ఖర్చయింది… కాబట్టి నాకు ఇంత ధర రావాలని ప్రభుత్వాలను కోరానని అలాగే పుష్పా 2 విషయంలో వాళ్ళు పెట్టిన ఖర్చుకు టికెట్ ఏ ధరలో ఉంటే న్యాయం జరుగుతుందో అదే అడిగారని… సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేట్ కరెక్ట్ ఏ రేట్ కరెక్ట్ కాదు అని చెప్పలేము అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా ఆధారంగా అది మారుతుందని ఒక సంవత్సరంలో విడుదల అయ్యే రెండు మూడు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతున్నాయని… ఈ సంవత్సరంలో కల్కి, దేవర, పుష్ప 2… మూడు సినిమాలకు మాత్రమే టికెట్స్ రేట్లు పెంచారని చెప్పుకొచ్చాడు.