రెబల్ స్టార్ మహమాటస్థుడు… ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు, నిర్మాతలకు కూడా డార్లింగే… ఇక హీరోయిన్లైతే తనకి ఫిదా అవ్వక తప్పదు. తన ఫుడ్ ట్రీట్ మెంట్ అలా ఉంటుంది. అలాంటి రెబల్ స్టార్ చాలా సార్లు ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా..? చాలా మందిని నమ్మి మోసపోయినా పూరీజగన్నాథ్ ని మించేలా రెబల్ స్టార్ కూడా మోసపోయాడని ఎందమందికి తెలుసు… ఇదే విషయం ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కారనం రెబల్ స్టార్ 300కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి చేరుకుని కూడా 1000 కోట్ల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. వస్తోంది..ఎందుకు? ఇందులో ఎక్కడ తను నష్టపోయే అంశం లేదు… ఊహించని రేంజ్ లో తెలివిగా రెబల్ స్టార్ దూసుకెళుతున్నాడు. ఒకవైపు ల్యాండ్ మీదే కాదు, పాన్ వరల్డ్ మూవీ మీద కూడా భారీ పెట్టుబడి పెడుతున్నాడు. స్పిరిట్ మూవీ విషయంలో రెమ్యునరేషన్ వద్దని ఏదో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు.. అదేంటో? ఎందుకి సెన్సేషనల్ నిర్ణయంమో చూసేయండి.
రెబల్ స్టార్ ప్రభాస్ బేసిగ్గానే రాజు… ఆస్తులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… అలాంటి స్టార్ కి 1000 కోట్ల అప్పా..? ఇది నిజమని తెలుస్తోంది. వెయ్యికోట్ల అప్పు వెనక చాలా పెద్ద బిజినెస్ స్ట్రాటజీ ఉంది. దాంతో తన స్పిరిట్ మూవీకి కనెక్షన్ కూడా ఉంది..
టాలీవుడ్ లో తెలివైన హీరో అంటే శోభన్ బాబు అంటారు. ఎందుకంటే, సంపాదించింది స్థలం మీద ఇన్వెస్ట్ చేసి కోట్లు ఘడించాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవటం ఇండస్ట్రీ కి నేర్పించాడు…
ఆవిషంయలో మురళీ మోహన్, చిరు, అండ్ కో అంతా ఆయన దారిలోనే నడిచారు.. ఐతే రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ కాబట్టి, తన ప్లానింగ్ కూడా కింగ్ సైజ్ లోనే ఉంటుంది
అందుకే తన కల్కీ మూవీ వసూళ్ల లెక్క 1195 కోట్లైతే, ఆ స్థాయిలోనే అప్పు చేశాడు ప్రభాస్. అంత అప్పు అంత అర్జెంట్ గా దేనికోసం…? తనకే సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది… అలా చూస్తే వెయ్యికోట్ల అప్పు అవసరమేమొచ్చింది… ఇది సామన్యంగా ఎవరికైనా వచ్చే డౌట్లు..
నిజానికి రెబల్ స్టార్ అప్పు చేసేది బిజినెస్ చేసి నష్టపోడానికి కాదు… ఆస్తులు వెనకేసుకోవటానికి. తనిప్పుడు మనీని, కార్లమీదో, లగ్జరీ ఖర్చులమీదో కాకుండా, స్థలాలు, పొలాలు, విల్లాల మీద పెడుతున్నాడు. సినిమాల మీద కూడా పెట్టుబడి పెడుతున్నాడు. అదికూడా రిజల్ట్ తో సంబంధంలేకుండా డబ్బులొచ్చేలా…మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్ తో దూసుకెళుతున్నాడు
ఆల్రెడీ రెండు ఫామ్ హైజ్ లున్నాక కూడా ప్రభాస్ మూడో ఫామ్ హౌజ్ కోసం 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు. ఫ్యూచర్ లో కన్వెన్షన్ సెంటర్ కి ఉపయోగ పడేలా ఈ ఫామ్ హౌజ్ ని యూరప్ లో నిర్మించే మాన్షన్స్ లా డిజైన్ చేశారట. ఇల్లే 2 ఎకరాలుంటుందని తెలుస్తోంది. ఆల్రెడీ లండన్ లో మాన్షన్ కొన్న ప్రభాస్, ముంబైలో మూడు లగ్జరీ ప్లాట్లు కొనేశాడు.
ఆల్ మోస్ట్ ఈ ఇన్వెస్ట్ మెంటే 270 కోట్లు.. అలానే కొత్త ఫామ్ హైజ్ కోసం 300 కోట్లు అప్పుతీసుకున్నాడట. ఇక తనతో సందీప్ రెడ్డి వంగ తీసే సినిమా కోసం తను తీసుకోవాల్సిన రెమ్యూనరేషన్ నే పెట్టుబడిగా పెడుతున్నాడు. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తోపాటు, నార్త్ తో కేవలం ముంబై, ఢిల్లీ సిటీల రైట్స్ కోసం 200 కోట్లు అదనంగా చెల్లించేలా డీల్ సెట్ చేసుకున్నాడు.. అంటే స్పిరిట్ మూవీ హిట్ అయితే అందులో తనకి 30శాతం వాటనే కాదు, ఈ సినిమా డిల్లీ, ముంబై, తోపాటు, ఓవర్ సీస్ రైట్స్ కూడా తనే సొంతం చేసుకున్నాడంటే వాటితో కనీసం 200 కోట్ల బిజినెస్ జరగొచ్చు…
ఎలా చూసినా 2000 నుంచి 5 వేల కోట్ల వ్యాపారాన్ని చాలా సెక్యూర్డ్ ఫీల్డ్ లో సంపాదించే పని చేస్తున్నాడు ప్రభాస్. ఓవైపు స్థలాలు, విల్లాలు, ఫామ్ హౌజ్ లతో స్థిరాస్తులు సొంతం చేసుకుంటూ, మరో వైపు చాలా సెక్యూర్ అనిపించేలా ఏరియారైట్స్ పరంగా కూడా సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఈ విషయంలో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ హీరోలను కూడా మించిపోయాడు రెబల్ స్టార్.