Project K: ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ ఫిలిం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజైంది. కానీ ఈ వీడియోలో కూడా డార్లింగ్ ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. ఈ పాన్ ఇంటర్నేషన్ల్ మూవీలో ప్రభాస్ ఎలా వుంటాడు? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హీరో చేయిని త్రీడీలో చూపించారేగానీ.. ప్రభాస్ అసలు లుక్ బైటకు రాలేదు. ఈ సోషియో ఫాంటసీ మూవీలో డార్లింగ్ ఎలా వుంటాడో చెప్పకుండా దర్శకుడు ఎందుకు ఊరిస్తున్నాడు అన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కె. రూ.500 కోట్లతో తెరకెక్కుతోంది. సినిమా తీయడం ఒక ఎత్తయితే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే నెలలు.. ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రైడర్స్ పేరుతో రీసెంట్‌గా వీడియో రిలీజ్ చేశారు.
విలన్ సైన్యం ఎలా వుంటారో మేకింగ్‌లో చూపించారు. హీరో దగ్గర నుంచి విలన్ అనుచరుల వరకు ప్రతి విషయంపై ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమాను తీస్తోంది నాగ అశ్విన్ అండ్ టీం. ఆ మధ్య టైర్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మధ్యమధ్యలో అసిస్టెంట్స్ మాటలతో కామెడీ టచ్ ఇచ్చాడు నాగ అశ్విన్. ఒక్క టైర్ కోసం ఓవర్ చేస్తున్నారు.. షాపుకు వెళ్తే దండిగా టైర్లు దొరుకుతాయని అసిస్టెంట్స్ కామెడీ చేశారు. ఇలా పడిన కష్టానికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి మేకింగ్ రిలీజ్ చేశారు.
మేకింగ్ చూసిన తర్వాత కథ అంతా టైరు చుట్టూ తిరుగుతుందా? ఆదిత్య 369లో టైం మిషన్ మాదిరి ఈ చిత్రంలో టైరుకు కూడా అంత ఇంపార్టెన్స్ వుందా? అనిపిస్తోంది. ప్రాజెక్ట్ కె మేకింగ్ వీడియో చూశాక మేకర్స్ కష్టం మామూలుగా లేదు అనిపించకమానదు. అమితాబ్, దీపిక పదుకునే నటిస్తున్నా.. ఇంతవరకు మేకింగ్‌లో ఒక్కరూ కనిపించలేదు. రైడర్స్ వీడియోలో విలన్ అసిస్టెంట్స్‌నే ఇలా చూపిస్తుంటే ఇక ప్రభాస్, అమితాబ్, దీపిక ఎలాంటి గెటప్స్‌తో ఉంటారా? అన్న ఆసక్తి పెరిగింది.