కాని నాగ్ అశ్విన్ కథ అందరితో చప్పట్లు కొట్టేలా చేస్తుందనే మాట అన్నాడంటే, మూవీలో ఎంత దమ్ముందో తెలిసిపోతుంది. కమల్ నే ఆశ్చర్య పరిచిన నాగ్ అశ్విన్, ప్రాజెక్ట్ కే విషయంలో ఏదో భారిగానే దుమ్ముదులిపేలా ఉన్నాడు. ఎవడే సుబ్రమణ్యం తో కదిలించాడు, మహానటి తో ఆశ్చర్య పరిచాడు. ఇప్పడు ప్రాజెక్ట్ కేతో రోమాలు నిక్కబొడిచేలా చేస్తాడా?
ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కేలోకి కమల్ వచ్చాడు కాబట్టి కే ఫర్ కమల్ అంటున్నారు. ఐతే లీకుల ప్రకారం చూస్తే ఒకప్పడుు అన్నట్టుగానే కే ఫర్ కల్కీ అనేదే కన్పామ్ అవుతోంది. ఇక బడ్జెట్ కూడా ఏదో 100 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టామన్నట్టు కాకుండా పక్కా లెక్కలతో వెళుతున్నారు. ప్రభాస్ కి 150 కోట్లు, కమల్ కి 30, దీపికాకు 20 కోట్లు ఇలా అమితాబ్, దిశ పటానీ అండ్ కో రెమ్యునరేషన్ కలిపితే 250 కోట్లు, ఇక మేకింగ్ కి 150 కోట్లు గ్రాఫిక్స్ కి 200 కోట్లు మొత్తంగా 600 కోట్ల బడ్జెట్ తో పక్కా లెక్కతో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ పాటికే 80శాతం షూటింగ్ జరగటంతో కమల్ వేసేది విలన్ రోలా, గెస్ట్ రోలా అన్న డౌట్లు పెరగాయి. ఏదేమైనా 30రోజుల కాల్ షీట్స్ కమల్ ఇవ్వటంతో ఇదేదో అద్భుతం చేసే సినిమా అన్నట్టు హైప్ పెరిగింది.