Kalki 2898 AD: ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మవీ కల్కి 2898 ఎ.డి. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్ర టైటిల్‌ను గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ బాలేదన్న వాళ్లే, గ్లింప్స్ చూసి గెంతులేస్తున్నారు. ఆరేంజ్‌లో ఉంది గ్లింప్స్. ప్రభాస్ సీరియస్ లుక్‌తోపాటు తన కాస్ట్యూమ్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
దీపికా లుక్ అంత గొప్పగాలేకున్నా, రుషుల విగ్రహాల దగ్గర అమితాబ్ లుక్, విలన్ గ్యాంగ్ విజువల్స్, ఇక శివలింగం దగ్గరకు వచ్చే రోబో విజువల్స్ చూస్తే హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదు అనటం కాదు.. హాలీవుడ్ వాళ్లే భారతీయ సినిమా తీస్తే ఎలా ఉంటుందా అనుకునేలా ఉంది. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్, ఆ ఆకలి తీరక ఫ్యాన్స్.. సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వేయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న సలార్ టీజర్ వచ్చి పండగ తెచ్చింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే (కల్కి 2898 ఎ.డి) గ్లింప్స్ మతిపోగొడుతోంది. ఇక గ్లింప్స్‌లో విజువల్స్ పరంగా చూస్తే, ఇది 2 వేలా 8 వందల 98 వ సంవత్సరం అంటే, ఫ్యూచర్‌లో జరిగే కథగా తెలుస్తోంది.
దేశాలు, ప్రకృతి వినాశనం తర్వాత మిగిలిన జనాన్ని ఓ వర్గం వేధిస్తుంటే, యుగమే అంతమయ్యే పరిస్తితి వస్తే.. కల్కి వచ్చి కాపాడి, యుగాంతానికి నాంది పలికే కథతో రాబోతోంది ఈమూవీ. ఇందులో త్రిశూలాలు, వాడిన గన్స్ తాలూకు డిజైన్స్ కాస్త కామెడీగా అనిపిస్తూ, తక్కువ క్వాలీటీతో కనిపిస్తోంది. కాని సినిమాటోగ్రఫి, విజువల్స్ ఎఫెక్స్, అందరి కాస్ట్యూమ్స్, అలానే కలర్ గ్రేడింగ్, ఇవన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఫస్ట్ టైం హాలీవుడ్ అవెంజర్స్, ఐరన్ మ్యాన్ లాంటివి మనోళ్లు తీస్తే ఎలా ఉంటుందనే డౌట్ కి, పర్ఫెక్ట్ ఆన్సర్ అనిపించుకుంటోంది ప్రాజెక్ట్ కే గ్లింప్స్. ఇంకా టీజర్, ట్రైలర్ వస్తే సీనే మారిపోతుంది. వేలకోట్లు పెట్టి హాలీవుడ్ తీసే సినిమాల తాలూకు క్వాలిటీని రూ.500 కోట్ల పెట్టుబడితోనే తీసుకొస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.