ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు ఎప్పుడు లేని క్రేజ్ ఇప్పుడు కనపడుతోంది. ఈ సినిమా దెబ్బకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ప్రీ బుకింగ్ మార్కెట్ చూస్తుంటే వేరే లెవెల్ లో జరుగుతోంది. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ హైప్ దారుణంగా ఉంది. వెస్ట్ బెంగాల్ లో బుకింగ్స్ చూసి బాలీవుడ్ జనాలు కూడా షాక్ అయ్యారు. గతంలో అక్కడ ఏ బాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ లో జరగలేదు.
ఇక పుష్ప ప్రీ బుకింగ్ మార్కెట్ చూస్తున్న ట్రేడ్ అనలిస్ట్ లు సినిమా వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఇంకా రెండు రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్ కు 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలాగే మిలియన్ టికెట్ లు బుక్ చేసారు. కచ్చితంగా ఇంకో మిలియన్ టికెట్ లు బుక్ కావడం పక్కా అనే టాక్ వస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ రెండు రోజులు సినిమా ప్రమోషన్స్ ను వేరే లెవెల్ లో ప్లాన్ చేసారు మేకర్స్. హైదరాబాద్ మెట్రోను కూడా గట్టిగా వాడుతున్నారు.
అయితే ఇప్పుడు సినిమాపై థియేటర్ ఓనర్లలో ఓ భయం స్టార్ట్ అయింది. సినిమా పూర్తి రన్ టైం 3.20 గంటలు అంటే దాదాపుగా 200 నిముషాలు… సినిమా హాల్లో వేసే యాడ్స్ + బ్రేక్ టైమ్ తో కలిపి ఒక్కో షో కి అయ్యే సమయం 210 నిముషాలు ఉంటుంది. రోజుకి 4 షో లు వేసే హాల్లో పుష్ప 2 కి ఒక రోజు ఆటలకి పట్టే సమయం 840 నిముషాలు సినిమా ఆడుతుంది. అంటే 14 గంటల పాటు సినిమా కంటిన్యూగా ఆడనుంది. సాధారణ సినిమా కి అయ్యే సమయం సగటు 160 నిముషాలు, ఒక రోజుకి పట్టే సమయం 10 గంటల 40 నిముషాలు మాత్రమే.
ఇక్కడ ఒక్కో థియేటర్ కి మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే పుష్ప 2 ఆడినన్ని రోజులు పాటు మిగిలిన సినిమాలు రోజు కి ఐదు ఆటలు వేస్తున్నట్టు లెక్క వేస్తున్నారు ఓనర్లు. పుష్ప సినిమా ఆడినన్ని రోజులు పాటు రోజుకి 3.20 నిముషాలు అదనం గా థియేటర్స్ కి మైంటైన్స్ ఖర్చులు అదనంగా ఉంటాయి. సినిమా తేడా వస్తే కొనుక్కునందుకే కాదు, సినిమా ఆడించినదుకు కూడా థియేటర్స్ యజమానులు కి చమురు వదిలించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.