PUSHPA 2: సౌత్‌లో సీక్వెల్స్ పండుగ.. 2024 సీక్వెల్స్ ఇయర్

2024 మొత్తం సీక్వెల్స్ వర్షంలో తడవబోతోంది. సౌత్‌లో 2024 సీక్వెల్స్ ఇయర్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10కి పైగా క్రేజీ సీక్వెల్స్ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇందులో టాప్ లిస్ట్‌లో ఉంది పుష్ప 2.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 02:47 PM IST

PUSHPA 2: సౌత్ లో ఎన్నడూ లేనన్ని సీక్వెల్స్ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పుడు పార్ట్ 2 అంటే నెగటివ్ సెంటిమెంట్‌గా ఫీల్ అయిన మేకర్స్ ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్‌గా చూస్తున్నారు. ఒక సినిమా.. రెండు బిజినెస్సుల అనే కొత్త ఫార్ములాని ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. దీంతో 2024 మొత్తం సీక్వెల్స్ వర్షంలో తడవబోతోంది. సౌత్‌లో 2024 సీక్వెల్స్ ఇయర్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10కి పైగా క్రేజీ సీక్వెల్స్ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడు..? సినిమా వాయిదా పడుతుందా..?

ఇందులో టాప్ లిస్ట్‌లో ఉంది పుష్ప 2. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గటే ఆగష్టులో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత టిల్లు స్క్వేర్, డబుల్ ఇస్మార్ట్, సలార్2, గూఢచారి 2, ప్రతినిధి 2, అఖండ 2 వంటి ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్‌పై ఎటాక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. పక్క ఇండస్ట్రీల్లో తెరకెక్కినా తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్నసీక్వెల్స్‌లో కాంతారా 2, యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర 2, భారతీయుడు 2, విడుదల పార్ట్ 2పై హెవీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలు షార్ట్ గ్యాప్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తానికి 2024 మామూలుగా వుండబోవడం లేదు.

సౌత్ ఇండస్ట్రీని ఓ దిశగా నడిపించబోతోంది. లెక్కలు పక్కాగా చూసుకుని నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. అందువల్ల సరైన క్వాలిటీ సిమాలు, భారీ ప్రాజెక్ట్స్ 2024లో రాబోతున్నాయి. మరి వీటిలో ఎన్ని సక్సెస్ అందుకొని నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తాయో చూడాలి.