పుష్ప 2 డిసెంబర్ 6 కి కాదు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 5 కి రిలీజ్ అన్నారు. ఒకరోజు ముందుకే డేట్ మార్చారు. అక్కడి వరకు బానే ఉంది. కాని 11, 500 థియేటర్స్ లో పుష్ప రిలీజ్ అనే మాటే, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నిజంగా పుష్ప 2 కి అన్ని స్క్రీన్స్ లో వసూళ్ల తుఫాన్ స్రుష్టించేంత దమ్ముందా..? పుష్ప మాస్ హిట్ కాబట్టి, దాని సీక్వెల్ మీద ఆల్ మోస్ట్ అందరికి ఓరేంజ్ లో ఆసక్తి ఉండటం ఖాయం. ఇక పుష్ప చూసిన బ్యాచ్ అంతా పుష్ప 2 కూడా చూసేందుకు 99 శాతం ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా హిట్ మూవీకి సీక్వెల్ అంటే, ఆల్రెడీ అంచనాలు ఆకాశాన్నంటుతాయి… దీనికి తోడు ఫిల్మ్ టీం ప్రచారం కూడా భారీగా పెంచింది. అంతమాత్రానికి పుష్ప 2 ఏకంగా కల్కీ, దేవర ని కలిపి మించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే కల్కీ, దేవర హిట్లకు కారణం కేవలం కథ, తీసిన విధానం మాత్రమే కాదు, అంతకుమించి వెరే రీజన్స్ ఉన్నాయి..అవేంటి? అలాంటి కారణం పుష్ప2 లో కూడా కనిపిస్తోందా?
పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 11500 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. అదికూడా ఆరు భాషల్లో… కేవలం ఇండియాలోనే 6500 స్క్రీన్స్ లో పుష్ప సీక్వెల్ దండెత్తబోతోంది. ఓవర్ సీస్ లో మాత్రం ఏకంగా 5 వేల స్క్రీన్స్ లో ఈ సినిమా రావటం కన్ఫామ్ అయ్యింది. కల్కి లాంటి సినిమా యూఎస్లో 1500 స్క్రీన్స్ లో వచ్చింది. ఓవరాల్ ఓవర్స్ సీస్ లో 4 వేల లోపు థియేటర్స్ లోనే కల్కీ రిలీజైంది.
దేవర 2 వేల స్క్రీన్స్ లోనే సందడి చేసింది. అలాంటిది పుష్ప 2 ఏకంగా ఓవర్ సీస్ లో 5 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అంటే చాలా మంది షాక్ అవుతున్నారు. నిజంగానే పుష్ప లాంటి హిట్ మూవీకి సీక్వెల్ అంటేనే కామన్ గా అందరి అటెన్షన్ అటువైపుంటుంది. ఈజీగా జనాలు థియేటర్స్ కి వస్తారు.
అలాని 11500 స్క్రీన్స్ ని నింపేసి, సినీ సునామీ తీసుకొచ్చే సత్తా ఐకాన్ స్టార అల్లు అర్జున్ లో ఉందా? అంటే ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రస్థావించుకోక తప్పదు.. బాహుబలి1, బాహుబలి 2 తో వచ్చిన ఇమేజ్ తో సాహో సోసోగా ఆడినా 500 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. ఇక రాధేవ్యామ్, ఆదిపురుష్ లాంటి మూవీలు నెగెటీవ్ టాక్ తెచ్చుకున్నా, 450 నుంచి 650 కోట్ల వరకు వసూల్లు వచ్చాయంటే అది పాన్ ఇండియా లెవల్లో రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్
సలార్ తో 750 కోట్లు కల్కీతో 1200 కోట్లు రాబట్టిన ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా కింగ్. తనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మరీ ముఖ్యంగా మాస్ లో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టే సలార్, కల్కీ లాంటి హిట్ మూవీలు ఆ రేంజ్ లో వసూళ్లు రాబట్టాయి. తన యావరేజ్ మూవీలు కూడా వందలకోట్లు రాబట్టే స్టామినాను సొంతం చేసుకున్నాయి
అచ్చంగా ఇలాంటి కారణమే దేవర వసూళ్ల వెనకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లో కూడా భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. పది పన్నెండేళ్ల క్రితం నుంచే తన సినిమాలు హిందీలో డబ్బై అక్కడి జనాల్లో తారక్ పేరు మారుమోగేలా చేసింది. త్రిబుల్ ఆర్ తో తన మార్కెట్ నార్త్ లో ఇక రాక్ సాలిడ్ గా మారిపోయింది. ఫలితంగానే దేవర మూవీ ఆరేంజ్ లో సౌత్ ని మించేలా నార్త్ లో వసూళ్లు రాబట్టింది. ఇంకా రాబడుతోంది
సో మాస్ లో భీబత్సమైన ఫ్యాన్ బేస్ ఉండటం వల్లే ప్రభాస్, ఎన్టీఆర్ రు నార్త్ లో ఖాన్లు, కపూర్లని దాటేశారు. మరి స్టైలిష్ స్టార్ గా ఫోకస్ అయిన ఐకాన్ స్టార్ కి ఆరేంజ్ ఉందా? అంటే పుష్ప వల్ల నార్త్ లో ఊర మాస్ లో భయంకరంగా బన్నీకి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. పుష్ప 2 కి ఆ ఫ్యాన్ బేస్ కలిసొస్తుంది. కాకపోతే పుష్ప2 తర్వాత బన్నీ చేసే సినిమా రిలీజై, దేవరలా దూసుకెళితేనే, ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత నార్త్ లో సాలిడ్ మాస్ ఫాలోయింగ్ ఉణ్న హీరోగా బన్నీ పేరు మారుమోగుతుంది. అప్పటి వరకు ఇది ప్రశ్నగానే మిగిలిఉంటుంది.
కాని పుష్ప హిట్ అయ్యిందన్న కాన్ఫిడెన్స్ తో పుష్ప 2ని 11,500 థియేటర్స్ లో రిలీజ్ చేయటం అంటే, ఇది నిర్మాతల అత్యాశే అనంటున్నారు.ఏదేమైనా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైతే, తక్కువ టైంలోనే కొండంతల కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాని ఏమాత్రం మిస్ ఫైర్ అయినా, ఒకేసారి సీన్ రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది…