కల్కీని పుష్ప మింగేసాడా…? విడుదలకు ముందే వెయ్యి కోట్లు

ఇప్పుడు తెలుగు సినిమా పేరు వింటే బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోంది. ఇండియన్ సినిమా అంటే మేమే మాదే అనుకున్న జనాలకు ఇండియన్ సినిమా అంటే మాది అంటూ రొమ్ము విరిచి చెప్పింది తెలుగు సినిమా. గతంలో తెలుగు సినిమాలను చులకనగా చూసిన జనాలకు ఇప్పుడు గట్టి షాక్ ఏ తగులుతోంది.

  • Written By:
  • Publish Date - October 18, 2024 / 03:15 PM IST

ఇప్పుడు తెలుగు సినిమా పేరు వింటే బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోంది. ఇండియన్ సినిమా అంటే మేమే మాదే అనుకున్న జనాలకు ఇండియన్ సినిమా అంటే మాది అంటూ రొమ్ము విరిచి చెప్పింది తెలుగు సినిమా. గతంలో తెలుగు సినిమాలను చులకనగా చూసిన జనాలకు ఇప్పుడు గట్టి షాక్ ఏ తగులుతోంది. ఓ వైపు ప్రభాస్, మరో వైపు ఎన్టీఆర్, ఇప్పుడు అల్లు అర్జున్ దెబ్బకు ఇండియన్ సినిమా షేక్ అవుతోంది. బాలీవుడ్ జనాలకు ఇప్పుడు పుష్ప 2 దెబ్బకు భయం మొదలయింది. ఏ రికార్డులు బద్దలు అవుతాయో అని భయపడుతోంది.

పుష్ప 2 సినిమా కోసం మూడేళ్ళకు పైగా సమయం తీసుకున్న సుకుమార్, బన్నీ సినిమాను ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మార్కెటింగ్ ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాకు ప్రీ బుకింగ్ మార్కెట్ తో పాటుగా ప్రీ రిలీజ్ మార్కెట్ ఓ రేంజ్ లో జరిగింది. ఇప్పుడు దేవర రికార్డులు బద్దలు కొడుతూ కొత్త టార్గెట్ లు ఫిక్స్ చేయడానికి పుష్ప 2 సిద్దమైంది. షూటింగ్ విషయంలో అవసరమైతే రెండు నెలలు ఆలస్యం అయినా పరవాలేదని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది.

భారీ మార్కెట్ జరిగే అవకాశం ఉండటంతో నిర్మాతలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. ఇక ప్రమోషన్స్ విషయంలో బన్నీ ప్లానింగ్ బిగ్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తనను ట్రోల్ చేయడానికి రెడీ గా ఉన్న మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గట్టిగానే సమాధానం చెప్పడానికి బన్నీ ఇప్పుడు సిద్దమవుతున్నాడు. ఇక వసూళ్లతో మెగా ఫ్యామిలీకి కూడా గట్టిగా సమాధానం చెప్పేందుకు భాయ్ మ్యాప్ రెడీ చేసాడు. ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ మార్కెట్ చూస్తే కచ్చితంగా షేక్ అవ్వడమే.

ఐకాన్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ ఐకాన్ స్టార్ అయ్యేందుకు ఇండియన్ సినిమాకు భాయ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. డిసెంబర్ ఆరున విడుదల అయ్యేందుకు పుష్ప 2 రెడీ అవుతోంది. కాని అప్పుడే సినిమా 900 కోట్లకు పైగా మార్కెట్ చేసింది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఆల్ టైం రికార్డ్ ధరకు విక్రయించింది నిర్మాణ సంస్థ. థియేటరికల్ రైట్స్ ఏకంగా 650 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు కోర్ట్ చేసారని టాక్. దీనితో విడుదల తర్వాత వసూళ్లు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇప్పుడు బాలీవుడ్ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది.