పుష్ప ది రూల్… ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో మెగా ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలైతే ఎలా అయినా ట్రోల్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ ట్రోలింగ్ ని ఎదుర్కొని సినిమాను హిట్ చేసుకోవాలని అల్లు అర్జున్ ఆర్మీ సిద్దంగా ఉంది. సినిమా ఆలస్యం అయినా పర్వాలేదు… ఎవరికి దొరకవద్దు అనే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. అందుకే సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయడం కంటే సినిమాలో కొన్ని సీన్స్ ను మళ్ళీ రీ షూట్ చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం పుష్ప 2 లో కొన్ని సీన్స్ ని మళ్ళీ షూట్ చేయడానికి కొన్ని లోకేషన్స్ కి వెళ్తున్నారు. ట్రోల్ చేసే అవకాశం ఉందని భావించిన సీన్స్ ని మళ్ళీ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప ది రూల్ లో ఉండే డైలాగులపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ డైలాగ్స్ ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పుష్ప సీరీస్ అనేది ఒక కూలీ… యెర్ర చందనం స్మగ్లింగ్ లో స్వయం కృషితో ఎలా ఆ సామ్రాజ్యాన్ని రూల్ చేసాడు అనేది. కేవలం ఎవరి సహకారం లేకుండా తన దమ్ము ధైర్యంతో పైకి వచ్చాడు.
కాబట్టి ఇప్పుడు కొన్ని విధాలుగా డైలాగులు ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ సహకారం లేకుండా, లేదంటే వాళ్ళ నీడలో నేను పైకి వచ్చాను అని బన్నీ చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు అసలు గొడవ జరుగుతుంది కూడా ఆ కాన్సెప్ట్ లోనే. ఆ విషయాన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పుష్ప ది రూల్ లో కూడా చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆ విషయాన్ని సుకుమార్ దృష్టికి కూడా బన్నీ తీసుకువెళ్ళాడని టాక్. తద్వారా స్వయం కృషితో తాను పైకి వచ్చా అనేది చెప్పడానికి బన్నీ ప్రయత్నం చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.