PUSHPA 2: పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంట్రీ మొత్తాన్ని ఎలా అల్లాడించాడో అందరికీ తెలసిందే. ఈ సినిమాలో అల్లు వారి అబ్బాయి చేసిన రచ్చకు నేషనల్ అవార్డు కూడా వరించింది. దీంతో.. పుష్ప 2 సినిమాపై విపరీతమైన క్రేజ్, హైప్ ఏర్పడ్డాయి. సినిమా విడుదల కాకముందే.. పుష్ప 2 సినిమా డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.వంద కోట్లకి కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఆ మొత్తం అంతా కూడా సుకుమార్ రెమ్యునరేషన్‌గా అందుకోబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్‌గా మారింది.
MAHESH BABU: కండీషన్స్‌తో మహేశ్‌కు చుక్కలు చూపిస్తున్న రాజమౌళి..!
ప్రస్తుతం పుష్ప 2 సినిమాని సుకుమార్ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. వాటిని అందుకోవడం కోసం సుకుమార్ అండ్ కో గట్టిగానే కష్టపడుతున్నారు. కాగా.. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి మాత్రమే ఉన్నారు. ఆయన లెక్క కలెక్షన్స్‌లో ప్రాఫిట్‌ను బట్టి ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ కూడా రాజమౌళి సరసన చేరారన్న లెక్కలు వినిపిస్తున్నాయి. డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.వంద కోట్లకి కొనుగోలు చేయడంతో.. ఆ మొత్తం అంతా కూడా నేరుగా సుకుమార్‌కే దక్కుతోంది.
బిజినెస్ ఒప్పందంలో భాగంగా ఈ డీల్ జరగడంతో సుకుమార్‌కి ఇలా కలిసొచ్చింది. దీంతో పుష్ప 2 సినిమాకి గాను ఏకంగా వంద కోట్ల రెమ్యునరేషన్‌ని సుకుమార్ అందుకున్నట్లు అయ్యింది. ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఈ విధంగా జక్కన్న సరసన ఈ లెక్కల మాస్టర్ కూడా చేరినట్లైంది.