PUSHPA 2: పుష్ప 3 నిజంగా తెరకెక్కుతుందా..? అందుకే పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడుతోందా..? సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. పుష్ప2 కోసం జపాన్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు సుకుమార్. కాని జపాన్ తాలూకు సీన్ ఏది కూడా పుష్ప 2లో లేకపోవటంతో, సీన్ మార్చాడా..? లేదంటే బయటొస్తున్న పుకార్ల ప్రకారం ఇది పుష్ప 3 కోసం ప్లాన్ చేసిన సీనా అన్న అనుమానాలు పెరిగాయి. అయితే పుష్పని రెండు భాగాలుగా తీసి, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలి అని సుకుమార్‌కి రాజమౌలి అప్పట్లో సలహా ఇచ్చాడు.
MAHESH BABU: మహేశ్ బాబు, రణ్‌బీర్‌కు ట్రైనింగ్ అవసరమా?
దీంతో సుకుమార్ అదే సలహాని పాటిస్తున్నాడు. ఇప్పుడు కూడా రాజమౌళినే సుకుమార్ మరో కోణంలో కూడా ఫాలో అవుతున్నాడంటున్నారు. అదే పుష్ప 3 గుసగుసలకు కారణం అవుతోందట. రాజమౌళి తన బాహుబలి 2 రిలీజ్ టైంలో బాహుబలి 3 కూడా ఉందన్నాడు. బాహుబలి వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. అయితే, బాహుబలి 3 మాత్రం ఎప్పుడూ సెట్స్ పైకెళ్లలేదు. త్రిబుల్ ఆర్ మూవీ కూడా ఆస్కార్ కోసం పోటి పడుతున్న టైంలో త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఉంటుందన్నాడు. అలా అందరిలో జోష్ పెంచేందుకు అటెన్షన్ త్రిబుల్ ఆర్ మీద ఉండేందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు.
అచ్చంగా అలానే పుష్ప 3 అంటూ సుకుమార్ పబ్లిసిటీ స్టంట్ ప్లాన్ చేశాడా? ఎందుకంటే పుష్ప 3 మీద బయట ఇంత చర్చ జరుగుతున్నా ఫిల్మ్ టీం నుంచి కాదని, ఔనని ఏ రెస్పాన్స్ లేదు. జనాల్లో ఇంత క్యూరియాసిటీ ఉందా అని ఫిల్మ్ టీం ఉప్పొంగిపోవటం చూస్తే నిజం ఐతే ఓకే. లేదంటే, ఎగ్జైట్మెంట్ ఆగ్రహంగా మారే ఛాన్స్ ఉంది.