Pushpa 2: పుష్ప రూ.380 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా మూవీ. మొన్నే బన్నీ, దేవిశ్రీకి నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. పొలిటీషియన్స్ నుంచి క్రికెటర్స్ వరకు ఈ మూవీ డైలాగ్స్ తో రీల్స్ చేశారు. కొందరు డాన్స్ చేశారు. సో.. ఇవన్నీచూస్తుంటే పుష్ప 2 బ్లాక్ బస్టరవ్వటం ఖాయం అనుకోవాల్సిందే. పెద్దగా ప్రమోషన్ లేకున్నా, పుష్ప సీక్వెల్ పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. కాని ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, పుష్ప మొదటి భాగం రూ.380 కోట్లు రాబడితే, పుష్ప 2కి రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే పుష్ప కి వచ్చిన మొత్తానికి మరో రూ.70 కోట్లు కలిపి పార్ట్ 2 తీస్తున్నారు.
సో ఫస్ట్ పార్ట్ లాభాలను పక్కన పెట్టి, వాటితో పాటు మరో రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే. అసలే పుష్ప వచ్చి రెండేళ్లవుతోంది. సో.. రిలీజ్ ఎంత డిలే అయితే, అంతగా జనాల్లో ఆ ఊపు తగ్గే ఛాన్స్ ఉంది. పుష్ప2లో ఏమాత్రంమ్యాజిక్ తగ్గినా మొదటి ఆటకే సినిమా అటకెక్కే అవకాశం ఉంది. దీనికి తోడు పుష్ప2 మార్చ్ 22 కి వచ్చేఛాన్స్ ఉందట. సో మార్చ్ కి ముందు సలార్, ఉస్తాద్ భగత్ సింగ్ సినమాలొచ్చే ఛాన్స్ ఉండటం, ఏప్రిల్ లో దేవర, చరణ్ సినిమాలొచ్చే అవకాశం ఉండటంతో ఈసారి పోటీ గట్టిగానే ఉండనుంది.
ఇలా నెగెటివ్ కోణంలో పుష్ప2 ని కొన్ని అంశాలు భయపెడుతుంటే, ఇంకొన్ని అంశాలు మాత్రం పుష్ప 2 కి హిట్ ని కన్ఫామ్ చేస్తున్నాయి.
రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఏ మూవీ ఈమధ్య కాలంలో ఫ్లాప్ కాలేదు. బాహుబలి1,2, కేజీయఫ్ 1,2 అలానే పొన్నియన్ సెల్వం 1,2 ఇవన్నీ హిట్లే. కాబట్టి పుష్ప 2 హిట్ కి కూడా అవకాశం ఎక్కువ. అంతేకాదు పుష్ప కంటే అప్పట్లో ప్రమోట్ చేయలేదు. అయినా హిట్టైంది. ఇప్పుడు ప్రమోషన్ కి కావాల్సినంత టైం ఉంది. ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ కాబట్టి, ఓపెనింగ్స్ తోనే పుష్ప 1 రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.