PUSHPA 2: బన్నీ కెరీర్‌ని మార్చిన మూవీ పుష్ప. ఇందులో తన ఫ్రెండ్ కేసవ ఇప్పుడు కొంపముంచాడు. తన మీద కేసు ఫైల్ అవటం, ఓ అమ్మాయి ఆత్మ హత్యకు తన బ్లాక్ మేయిలే కారణం అవటం పుష్పకి నిజంగా చికాకు తెప్పించే విషయమే. అసలే పుష్ప రాజ్ సీక్వెల్ 80శాతం పూర్తైంది. ఆగస్ట్ 15కి రిలీజ్ అనుకున్నా ఈ సినిమా కథ పరంగా, మేకింగ్ పరంగా టైం తీసుకుని తెరకెక్కిస్తూ వస్తున్నారు. అలాంటి మూవీలో ఇప్పుడు కథపరంగా, పాత్రల పరంగా మార్పులు తప్పేలా లేవు.
SALAAR: సలార్‌ని కాపాడేది కేజీఎఫ్3 యేనా..?
ఎందుకంటే ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ని బ్లాక్ మేయిల్ చేసి, తను సూసైడ్ చేసుకునేలా చేసిన జగదీష్ అలియాస్ కేశవ వల్ల పుష్ప 2కి పంచ్ పడేలా ఉంది. ఏదో చిన్న పాత్ర వేశాడా అంటే అదీలేదు. పుష్పకి రైట్ హ్యాండ్‌లా కనిపించిన కేశవ సెకండ్ పార్ట్‌లో కూడా ఇంపార్టెంట్ రోలే వేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఫైల్ అవటం అంటే, అది పుష్ప 2 రిలీజ్ టైంలో డ్యామేజ్‌లా మారేలా ఉంది. సరే తన పాత్ర తీసేద్దామా అంటే చిన్న పాత్రకాదు.. ఇప్పటికే 80 శాతం షూటింగ్ అయిపోయింది. కాబట్టి తన స్థానంలో మరొకరిని పెట్టి మళ్లీ ఆ సీన్లు తీస్తారా..? లేదంటే తీసిన వరకు ఉంచి, మిగతా సీన్లలో తన పాత్ర అవసరం లేకుండా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, పాత్రకు పాతరేస్తారా? ఈ డౌట్లు మొదలయ్యాయి.
అలా కాకుండా తను నిర్దోషిగా బయటికొస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ, తను దోషి అని తేలితే పుష్ప సీక్వెల్‌కి పాన్ ఇండియా లెవల్లో కష్టాలు తప్పవు. నేషనల్ మీడియా కూడా ఊరుకోదు. ప్రమోషన్ టైంలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇది పుష్ప 2 బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు.