పుష్ప2 మూవీ హిట్ అనటంలో ఎలాంటి డౌట్ లేదు. మొదటి భాగం హిట్ కాబట్టి, సీక్వెల్ ఆటోమేటిగ్గా హిట్టవ్వాలి… మొదటి భాగం చూసిన బ్యాచ్, ఖచ్చితంగా సీక్వెల్ చూస్తారు కాబట్టి ఇక్కడ హిట్ అనేది డిస్కర్షన్ కాదు వసూళ్లే మ్యాటర్. విచిత్రం ఏంటంటే ఈ సినిమాను ఎవరో చెత్త అని కామెంట్ చేస్తే అది యాంటి ఫ్యాన్స్ పని అనుకోవచ్చు. కాని డైరెక్టర్ సుకుమారే ఒక దశలో పుష్ప2 ఫుటేజ్ ని ట్రాష్ లో వేశాడంటే నమ్ముతారా? ఇదే జరిగిందన్న డిస్కర్షన్ ని సాలిడ్ రీజనుంది? ఇది నిజంగా పుష్ప 2 తాలూకు ఓటీటీ రిలీజ్ తో క్లియర్ కట్ గా రివీల్ కాబోతోందని తెలుస్తోంది. ఇంతకి తన సినిమాను తానే చెత్తబుట్టలో వేసే సాహసం ఏ డైరెక్టర్ చేయడు.. కాని సుకుమార్ చేశాడని తెలుస్తోంది. అదేంటో చూసేయండి.
పుష్ప 2 బ్లాక్ బస్టరే కావొచ్చు. కాని కలెక్సన్స్ మీద డౌట్లు మాత్రం అలానే ఉంటున్నాయి. ఇలాంటి టౌంలో జనవరి 9కి పుష్ప రాజ్ ఓటీటీ మీద దాడి చేయబోతున్నాడనే ప్రచారం పెరిగింది. కట్ చేస్తే పుష్ప2 ని చెత్తబుట్టలో వేసిన సుకుమార్, సడన్ గా ఆ చెత్తబుట్టని మళ్లీ టచ్ చేశాడనంటున్నారు
ఎంతో ఇష్టంగా పాత్రని మలిచి, పుష్ప ని హిట్ చేసిన సుకుమార్, రెండో పార్ట్ కోసం రెండేళ్లు కథని శిల్పంలా చెక్కీ చెక్కీ, చివరికి మూడేళ్ల తర్వాత పుష్ప2 ది రూల్ ని తీసుకొచ్చాడు. ఏకంగా మూడున్నర గంటల నిడివితో యానిమల్ లాంటి ప్రయోగమే చేశాడు.
రిలీజ్ తర్వాత టాక్ కిక్ ఇచ్చింది. వసూళ్ల వరదొచ్చింది. ఆ వరద లెక్కల మీద డౌట్ల వరద కూడా పెరుగుతోంది. ఆ నెగెటివిటీనీ, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ ని కాస్త పక్కన పెడితే, అసలు పుష్ప2 ని ముందు పక్కన పెట్టింది సుకుమారే అని తెలుస్తోంది
పుష్ప2 నిజానికి మూడున్నర గంటల మూవీకాదని, ఫైనల్ కట్ తర్వాత ఏడుగంటల డ్యూరేషన్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో చాలా సీన్లు తీసేసి, పుష్ప2 కి మరో వెర్షన్ ని హోల్డ్ లో పెట్టాడట సుకుమార్. కాని ఫస్ట్ వర్షన్ నే సినిమాగా రిలీజ్ చేశారని తెలుస్తోంది
అందుకే పుష్ప2 లో ఓపెనింగ్ సీన్ తో పాటు చాలా సీన్ల మధ్య కొద్దిగా కనెక్షన్ మిస్ అయినట్టు ఉందనే కామెంట్స్ పెరిగాయి. ఐతే 7 గంటల పుష్ప2 ని మూడున్నర గంటలే సినిమాగాచూపించిన సుకుమార్,మిగతా మూడున్నర గంటల వర్షన్ ని ట్రాష్ లో వేసినట్టే అని తేలుస్తున్నారు. రెండు మూడేళ్ల వరకు పుష్ప3 ప్రస్థావనే ఉండదంటే, ఇక ఈ మిగిలిపోయిన మూడున్నర గంటల సీన్లు నిజంగానే ట్రాష్ లో వేసినట్టే, కష్టం వ్రుధా అయినట్టే…
అలా సుకుమార్ తన కష్టాన్ని తానే ట్రాష్ లో వేసేశాడనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో ఆ వర్షన్ తాలూకు సీన్లు కూడా పెట్టి మొత్తం 7 గంటల నిడివి ఉన్న పుష్ప2 ని 45 నిమిషాల ఎపిసోడ్స్ లా విడగొట్టి 8 ఎపిసోడ్ల వెబ్ సీరీస్ లా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ మొదలైందట… అది ప్రాక్టికల్ గా పాజిబులో కాదో కాని, ఇటువైపు కూడా ఫిల్మ్ టీం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.