పుష్ప 2 కి సడన్ గా దెబ్బ…హిందీలో హిట్టు తెలుగులో 60% డౌటు…

పుష్పరాజ్ ప్రజెంట్ అరెస్ట్ సీన్ తో ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఊహించని పరిణామం ఇది.. ఎగ్జాక్ట్ గా పుష్ఫ 2 వెయ్యికోట్లు రాబట్టిన తర్వాతే ఈ ఇన్స్ డెంట్ జరగటంతో అంతా షాక్ అయ్యారు. ఒకవైపు తనకి బేయిల్ వచ్చినా, ఇదే టైంలోపుష్ప2 మూవీ తెలుగు వసూళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి....

  • Written By:
  • Publish Date - December 14, 2024 / 06:39 PM IST

పుష్పరాజ్ ప్రజెంట్ అరెస్ట్ సీన్ తో ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఊహించని పరిణామం ఇది.. ఎగ్జాక్ట్ గా పుష్ఫ 2 వెయ్యికోట్లు రాబట్టిన తర్వాతే ఈ ఇన్స్ డెంట్ జరగటంతో అంతా షాక్ అయ్యారు. ఒకవైపు తనకి బేయిల్ వచ్చినా, ఇదే టైంలోపుష్ప2 మూవీ తెలుగు వసూళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి….. కేవలం నార్త్ ఇండియాలో వస్తున్న వసూళ్లే పుష్పీ2 ని కాపాడుతున్నాయి కాని, తెలుగులో పుష్పరాజ్ సఫర్ అవ్వక తప్పదా అన్న డౌట్లు పెరిగాయి. ఒక్కసారికిగా 60నుంచి డెబ్బై శాతం వరకు పుష్ప 2 వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప2 వసూల్లు డ్రాప్ అవటంతో బ్రేక్ ఈవెనే కష్టమౌతోంది. దీంతో నార్త్ లో కలెక్షన్స్ తో కొండంత రాగం తీసి, సౌత్ లో చతికిల పడే పరిస్థితొచ్చిందనుకుంటున్నటైంలోనే, బన్నీ అరెస్ట్ డబుల్ షాక్ గా మారుతోంది. ఇంతకి పుష్ప2 తెలుగు వర్షన్ కొచ్చిన కష్టాలేంటి? ఎందుకలా?

బన్నీ అరెస్ట్, బేయిల్, ఈ ఇన్స్ డెంట్ ఎలా ఉన్నా, టాలీవుడ్ లో మాత్రం రెండు రోజులుగా పుష్ఫ 2 వసూల్లు ఊహాతీతంగా డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తోంది. అసలు కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్న బ్యాచ్ కి బ్రేక్ ఈవనే కష్టమవుతోందనంటున్నారు. కేవలం నార్త్ ఇండియా వసూళ్లే బాగున్నాయని, సౌత్ లో రోజు రోజుకి వసూళ్లు డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతున్నాయని వార్తలొస్తున్నాయి

నిజానికి గ్రాస్ వసూళ్లని పక్కన పెట్టి నెట్ వసూల్లలో, త్రిబుల్ ఆర్, నే కాదు బాహుబలి2 ని కూడా పుష్ప టార్గెట్ చేశాడన్నారు. నిజానికి త్రిబుల్ ఆర్ 772 కోట్ల నెట్ వసూళ్ళని 1350 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబ్టింది. సో పుష్ప 2 గ్రాస్ వసూళ్లు 1000 కోట్ల దాటితే, ఇందులో 736 కోట్లు నెట్ వసూళ్లంటున్నారు

అంటే మరో 40 కోట్ల వరకు నెట్ వసూళ్లు వస్తే త్రిబుల్ ఆర్ ని పుష్ప2 మూవీ దాటేసినట్టే, బాహుబలి కన్ క్లూజన్ 1850 కోట్ల గ్రాస్ వసూల్లలో 1031 కోట్లు నెట్ వసూల్లు. అంటే మరో 300 కోట్లు రాబడితే బాహుబలి 2 రికార్డుని కూడా పుష్ప 2 బ్రేక్ చేసినట్టే. ఈ ఆశలు బానే ఉన్నాయి

కాని 6 వ రోజు 60 శాతం సౌత్ లో వసూళ్లు డ్రాప్ అయితే, తెలుగు రాష్ట్రాల్లో 70శాతం వరకు వసూళ్లలో డ్రాప్ అయ్యాయంటున్నారు. అదే జరిగితే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావటమే కష్టమయ్యే ఛాన్స్ ఉందనంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చూస్తే ఎనిమిదో రోజు వసూళ్లు మొత్తం కూడా 9 కోట్లే వచ్చాయట. ఇది 8 రోజుల వసూళ్లలో అన్నీంటికంటే లోయెస్ట్… అంత క్రేజ్, మార్కెట్ లో అంత మోజున్నమూవీ 6 రోజుల్లో 1000 కోట్లు రాబట్టి, ఆరో రోజు 60శాతం, ఏడోరోజు 70శాతం వసూళ్లు డ్రాప్ అవ్వటం షాక్ ఇస్తోంది. ఎనిమిదో రోజు మరీ 9 కోట్ల వసూళ్లే తెలుగు రాష్ట్రాల్లో రావటం ఊహాతీతం… కాబట్టే, పుష్ప 2 వసూల్ల మీద అనుమానాలు తగ్గట్లేదు. కామెంట్ల జోరు ఇంకా ఆగట్లేదు.