Pushpa 2: ఆర్ఆర్ఆర్‌ను మించేలా ‘పుష్ప-2’ ఇంటర్వెల్.. పూనకాలు గ్యారెంటీ..

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. అంతలా సంచలనం సృష్టించిన ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్.. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

  • Written By:
  • Updated On - February 21, 2024 / 03:14 PM IST

Pushpa 2: దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప-2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-1’ పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. అంతలా సంచలనం సృష్టించిన ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

PAWAN KALYAN: పవన్‌ పోటీ చేసే స్థానం ఫిక్స్‌.. భీమవరం నుంచే జనసేనాని

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్.. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది. ‘పుష్ప-2’ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని దర్శకుడు సుకుమార్ ఓ రేంజ్‌లో రూపొందిస్తున్నాడట. ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్‌లో ఒకటిగా నిలిచేలా దీనిని ప్లాన్ చేస్తున్నారట. జాతర నేపథ్యంలో సాగే ఈ ఇంటర్వెల్ బ్లాక్.. గూస్ బంప్స్ తెప్పించే సాంగ్, ఫైట్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌తో ఉంటుందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో పాటు పదుల సంఖ్యలో ముఖ్య తారాగణం, వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్‌లపై ఈ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ గురించి ప్రపంచం మొత్తం ఎలా మాట్లాడుకుందో.. ‘పుష్ప-2’ ఇంటర్వెల్ గురించి అలా మాట్లాడుకుంటారని అంటున్నారు.

ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. ఈ ఖర్చుతో ఒక మీడియం రేంజ్ సినిమా తీయొచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ‘పుష్ప-2’ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మూవీ టీం మాత్రం అదే డేట్‌కి సినిమాని తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. ఎప్పుడు విడుదలైనా ‘పుష్ప-2’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి.