Pushpa 2 : ‘పుష్ప 2’కి 100 కోట్ల అడ్వాన్స్

పుష్ప2 (Pushpa 2) పై ఉన్న అంచనాలకు భారీ బిజినెస్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

పుష్ప2 (Pushpa 2) పై ఉన్న అంచనాలకు భారీ బిజినెస్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దీంతో పుష్ప 2 రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. ముఖ్యంగా నార్త్‌లో పుష్పరాజ్‌కు యమా డిమాండ్ ఉంది. అక్కడ ఏకంగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.

మిగతా భాషల్లోను భారీ బిజినెస్ జరుపుకుంటోంది. ఓవర్సీస్‌లో కూడా రికార్డు బిజినెస్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే.. తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. తెలుగులో ఈ సినిమాకు మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో.. ఇంకా బేరం తెగలేదని ప్రచారం జరుగుతోంది. అయితే.. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ సినిమా నైజాం రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. నైజాం పంపిణీ హక్కులను కొనుగోలు చేయడానికి ఒక బడా డిస్ట్రిబ్యూటర్ పుష్ప 2 మేకర్స్‌కు అడ్వాన్స్‌గా 100 కోట్లు ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. ఇదే నిజమైతే.. ఒక్క నైజాంలోనే వంద కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదని అంటున్నారు.

ఈ లెక్కన థియేట్రికల్ బిజినెస్‌ (Business) తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉందంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సుకుమార్ అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప, సూసేకి సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. మరి ఆగస్టు 15న రానున్న పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.