పుష్ప 2 ప్రీ రిలీజ్ కు దేవర…? బన్నీ రిక్వస్ట్ కు ఓకే…?

టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోల రూట్ వేరు... మిగిలిన వాళ్ళ రూట్ వేరు. ఆ ఇద్దరే అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఈ ఇద్దరినీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పగబట్టి ట్రోల్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.

  • Written By:
  • Publish Date - October 24, 2024 / 08:40 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోల రూట్ వేరు… మిగిలిన వాళ్ళ రూట్ వేరు. ఆ ఇద్దరే అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఈ ఇద్దరినీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పగబట్టి ట్రోల్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. దానికి తోడు ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ దేవర సినిమాను ట్రోల్ చేయగా ఇప్పుడు పుష్ప 2 సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాటిని తట్టుకుని దేవర నిలబడి… బాక్సాఫీస్ లో వసూళ్ళ సైక్లోన్ సృష్టించింది.

ఎన్నో సినిమాల రికార్డులు కనుమరుగు అయిపోయాయి. నయా హిస్టరీని ఎన్టీఆర్… దేవర సినిమాతో గ్రాండ్ గా రాసాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. ట్రోలింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మొదటి పార్ట్ టైం లో కూడా సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ తో చెలరేగిపోయారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు పుష్ప 2 ని కూడా అలాగే ట్రోల్ చేయాలని చూస్తున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉందని టాక్. బన్నీకి ఇప్పటికే వైసీపీ క్యాడర్ నుంచి సపోర్ట్ గట్టిగా ఉంది. తమ హీరోగా అల్లు అర్జున్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో అల్లు అర్జున్ కోసం నిలబడుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గట్టిగా ప్లాన్ చేయడమే కాకుండా ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోలో కూడా ఇంటర్వ్యూ గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు రెండు ప్లాన్ చేస్తున్నారట. ఒకటి ముంబైలో రెండు చిత్తూరులో. శేషాచలం అడవుల కథతోనే ఈ సినిమాను షూట్ చేసారు. అక్కడ జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని సినిమా ప్లాన్ చేసారు. అందుకే చిత్తూరులో సినిమా ప్రమోషన్ చేస్తే… కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఫ్యాన్స్ వస్తారు.

అక్కడి మీడియాలో కూడా ఓ రేంజ్ లో హైప్ వస్తుందని భావిస్తున్నారు. తిరుపతి లేదా చిత్తూరులో ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్ కు రజనీ కాంత్, ఎన్టీఆర్ ను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. రజనీ కాంత్ ను ఫాహాద్ ఫాజిల్ ఆహ్వానిస్తాడని టాక్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తే కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైప్ వస్తుంది. సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.