ఇప్పుడు తెలుగు సినిమాలో రివెంజ్ అనేది ఎక్కువగా కనపడుతోంది. దేవర సినిమా దెబ్బకు ఇది బాగా ప్రూవ్ అయింది. కొరటాల శివ మీదున్న కోపాన్ని ఎన్టీఆర్ మీద చూపించడం కాస్త సంచలనం అయింది. దేవర సినిమాను మెగా ఫ్యాన్స్ ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ట్రోల్ చేయడం మనం చూసాం. అయినా కూడా దేవర సినిమా ఎక్కడా కూడా వసూళ్ళ విషయంలో వెనకడుగు వేయలేదు అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు తర్వాతి సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్త పడే పరిస్థితి వచ్చిందనే మాట వాస్తవం.
ఇదిలా ఉంచితే ఇతర హీరోలు కూడా ఇప్పుడు ట్రోలింగ్ దెబ్బకు భయపడే పరిస్థితి వచ్చిందని క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ పెద్ద చర్చే జరుగుతోంది. దేవర సినిమాను నాలుగు వైపుల నుంచి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పుష్ప 2 ని కూడా మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసే అవకాశం క్లియర్ గా ఉంది. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్ కాస్త సీరియస్ గానే వర్క్ చేయడం మొదలుపెట్టాడు. అల్లు అర్జున్ సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండే అల్లు స్నేహా రెడ్డి ప్లాన్ వర్కౌట్ చేయడం మొదలుపెట్టారు.
సినిమా ట్రైలర్ నుంచి క్రికెటర్లతో ప్రమోషన్ స్టార్ట్ చేయించాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా విడుదల అయిన తర్వాత పుష్ప పార్ట్ 1 కి ప్రమోషన్స్ చేసారు. కాని ఇప్పుడు అలా కాకుండా సినిమా ట్రైలర్ ను విడుదల చేసి దానితో ఎక్కువగా ప్రమోషన్స్ చేయించాలని అందులో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండే విధంగా ట్రైలర్ కట్ ఉండాలని స్నేహా రెడ్డి… సుకుమార్ కి క్లారిటీ ఇచ్చారట. అన్నీ బాగుంటే దీపావళి రోజు కచ్చితంగా ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే కొందరు క్రికెటర్లతో మాట్లాడారట.
ఇప్పుడు న్యూజిలాండ్ తో సీరీస్ ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా సీరీస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సీరీస్ లతో క్రికెటర్ లు బిజీగా ఉంటారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 ట్రైలర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా ఓ ట్రైలర్ ను లాంచ్ చేసి దాన్ని క్రికెటర్లతో ప్రమోషన్ చేయించడానికి స్నేహా రెడ్డి రెడీ అవుతున్నారు. పుష్ప 2 ని ఎవరు ట్రోల్ చేసినా ఇతర భాషల్లో ఎక్కువగా ఆడేలా, వసూళ్లు వచ్చేలా ఆమె ప్లాన్ మొదలుపెట్టారు.