PUSHPA 2: ఆగస్ట్ 15 అంటేనే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ని కుదిపేస్తున్న ముహుర్తం. ఆ రోజు పుష్ప 2 రాబోతోంది. వాయిదాకి ఛాన్స్ లేదని ఫిల్మ్ టీం తేల్చింది. కాని ఎక్కడో ఏదో మూలన ఓ డౌటుంది. అందుకే ముందుగా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు పుష్ప 2 వాయిదా పడాలని, ఆ ముహుర్తానికి తమ మూవీని రిలీజ్ చేయాలని లెక్కలేసుకుంటున్నారు. ఆలిస్ట్‌లో విచిత్రంగా దేవరటీం ఉంది.
PRABHAS: రెబల్ స్టార్ మళ్లీ విరామం కావాలంటున్నాడు
ఏప్రిల్ 5న రావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల డిలే వల్ల మరో మంచి ముహుర్తానికి వాయిదా వేయాలనుకుంటున్నారు. ఎలాగూ పుష్ప 2 వాయిదా పడితే, ఆ డేట్‌ని బుక్ చేసుకోవాలని దేవర టీం ట్రై చేస్తోంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, భారతీయుడు 2ని ఆగస్ట్‌లో, గేమ్ ఛేజంర్‌ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నిస్తున్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య కూడా తన కంగువ మూవీని ఏప్రిల్‌లో కాదని, ఆగస్ట్‌కి విడుదల ప్లాన్ చేస్తున్నాడట. గ్రాఫిక్స్ పనులు జరగలేదని దేవరలానే ఈ సినిమా కూడా ఏప్రిల్‌ని కాదని విడుదల వాయిదా వేసుకుంది.
ఆగస్ట్ 15నే టార్గెట్ చేసుకుంది. అందుకే ఆగస్ట్ 15 న పుష్ప 2 రాకుండా, పోస్ట్‌పోన్ అయితే, ఆడేట్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కి సిద్దమవ్వాలని కంగువ, దేవర, భారతీయడు 2 నిర్మాతలు కర్చీఫ్‌లు పట్టుకుని తిరుగుతున్నారు.