అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. నార్త్ సౌత్ అని తేడా లేకుండా అందరి మనసును గెలుచుకుంది. బన్నీ యాక్టింగ్ కు యావత్ దేశం ఫిదా అయిందనే చెప్పాలి. అంతేకాక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ని కూడా తీసుకొచ్చింది. అల్లు అర్జున్ కి మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి ఇంతవరకు రాని ఆ అవార్డుని దక్కించిన ఘనత.. సుకుమార్, అల్లుఅర్జున్లకే దక్కింది. ఒకపక్క పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సంచలనాన్ని క్రియేట్ చేసి కలెక్షన్ అదరగొట్టడమే కాకుండా.. మరోపక్క జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సంపాదించి పెట్టిన ఆ సినిమా సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఆ అంచనాలను డబుల్ చేశాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.
Salaar : సలార్ సెన్సేషన్.. హాట్ కేకుల్లా ప్రీ బుకింగ్స్
పుష్ప 2 కథ ఏమయ్యి ఉంటుందా అని అందరిలో ఓ క్యూరియాసిటి నెలకొంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పుష్ప 2 గురించి రష్మికని ప్రశ్నించగా, రణబీర్ కలుగజేసుకొని.. పుష్ప 2 స్టోరీ చెప్పు అంటూ అడిగారు అయితే రణబీర్ కపూర్ స్టోరీ లీక్ చేసి అంచనాలు పెంచేశాడు. రీసెంట్ గా యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి వచ్చారు. అయితే సినిమా విషయాలతో పాటు పుష్ప 2 స్టోరీని లీక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 గురించి సందీప్ వంగా తో కలిసి షూటింగ్ స్పాట్లో మాట్లాడుకున్నామని.. సినిమా కథ ఏమై ఉంటుందా అనే దానిపై.. తమకు తామే బోలెడన్ని కథలను చిత్రీకరించుకున్నామని చెప్పుకొచ్చాడు రణబీర్. సినిమాలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయి ఉంటుంద.. పుష్పా-శ్రీవల్లి బిడ్డని విలన్లు చంపేసి ఉంటారు. ఆ రివేంజ్ తీర్చుకోవడానికి పుష్ప బయలుదేరి ఉంటాడు. అది కథై ఉంటుందని రణబీర్ హింట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాక పుష్ప ఫ్రెండ్ కూడా చనిపోతాడేమో తన గురించి కూడా రివేంజ్ తీసుకోవడానికి సినిమా కథ అల్లుతారు ఏమో అని అనేవాడు. ఇలా రణబీర్ కపూర్ , సందీప్ వంగా డిఫరెంట్ కదలని అనుకున్నామని.. ఆ కథల గురించి బాలకృష్ణతో చెప్పాడు. ఇక ఇది చూసిన ఆడియన్స్.. వీళ్ళు కూడా మనలా పుష్ప 2 పై ఇంత ఆసక్తితో ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. పుష్ప2 కథని సృష్టించుకుని బయటికి చెప్పడం బానే ఉంది కానీ.. అందులో ఏదైనా కథ నిజమై ఉంటుందా అని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తుంటే.. లాజిక్ మాస్టర్ సుకుమార్ కథలో లాజిక్ ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదని కొందరి అభిప్రాయం.