Pushpa 2-The Rule: సుకుమార్ అండ్ టీం ఎప్పటి నుంచో ఊరిస్తున్న పుష్ప-2 సెకండ్ గ్లింప్స్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పుష్ప స్టోరీ మొత్తం చెప్పేశాడు సుకుమార్. పుష్ప మీద పగ తీర్చుకునేందుకు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చెప్తూ పార్ట్ వన్ ఎండ్ చేశారు. ఇప్పుడు పార్ట్-2 గ్లింప్స్ చూస్తుంటే.. వాళ్లందరితో పుష్పకు జరిగే వార్‌ను సెకండ్ పార్ట్‌లో చూపించినట్టుగా తెలుస్తోంది.
విలన్స్ అంతా కలిసి పుష్ప సామ్రాజ్యంపై ఎలా దాడి చేశారు? పుష్పను ఎలా జైలుకు పంపించారు? చివరకు 2004లో జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేదే సెకండ్ పార్ట్ స్టోరీ లైన్ అని సుకుమార్ తేల్చేశాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో పుష్ప ఎక్కడా అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు సుకుమార్. కానీ ఇవాళ రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అల్లు అర్జున్ ఫేస్ రివీల్ చేశాడు. అల్లు అర్జున్ స్మగ్లర్‌గా ఎదుగుతున్న టైంలో అక్కడి ప్రజలకు ఎలాంటి సహాయాలు చేశాడు అనే విషయాన్ని తెలిపేలా గ్లింప్స్ కట్ చేశాడు. తాను సంపాదించుకున్న డబ్బును ప్రజలకు కూడా పంచుతూ వాళ్లనే సైన్యంగా పుష్ప మార్చుకున్నట్టు చూపించాడు.
పుష్ప జైలు నుంచి తప్పించుకోగానే తిరుపతిలోనే కాకుండా చైనా, జపాన్, మలేషియాలో కూడా పోలీసులు వెతికారు. అంటే పార్ట్-2లో పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా ఎదిగినట్టు చూపించాడు సుకుమార్. గ్లింప్స్‌ని బట్టి చూస్తే సినిమాలో ఎలివేషన్స్ కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. కానీ పులే రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం” ఈ ఒక్క డైలాగ్‌తో పార్ట్ -2లో పుష్ప క్యారెక్టర్ ఎంత వైలెంట్‌గా ఉంటుందో చెప్పేశాడు సుకుమార్. గ్లింప్స్ ఎండింగ్‌లో “ఇది పుష్ప గాడి రూలు” అంటూ బన్నీ చెప్పిన డైలగ్ ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది.
మూడు నిమిషాల్లో అల్లు అర్జున్ రెండు సార్లు మాత్రమే కనిపించినా.. ఆ రెండు సీన్స్‌లో బన్నీని ఎలివేట్ చేసిన తీరు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. పార్ట్-2లో కూడా రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపేశాడు. ప్రతీ సీన్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత కిక్ ఇచ్చింది. స్పెషల్‌గా బన్నీ ఫేస్ రివీల్ చేసినప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. కానీ గ్లింప్స్ మొత్తం పుష్ప బతికే ఉన్నాడా లేదా, పుష్ప గురించి ప్రజలు ఎలా ధర్నాలకు దిగుతున్నారు అనే విషయాలను కూడా రివీల్ చేశారు. కానీ వేరే క్యారెక్టర్స్‌ను చూపించలేదు. సినిమాలో కీ రోల్స్ ఎవరినీ చూపించలేదు.
పార్ట్-2ను పుష్ప మిస్సింగ్‌తో ఓపెన్ చేసి తరువాత పుష్ప రూలింగ్ గురించి చూపించే చాన్స్ ఉంది. పుష్ప పార్ట్ 1 సౌత్‌లో ఎంత హిట్ అయ్యిందో నార్త్‌లో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2పై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ముందుగానే చెప్పారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వైల్డ్ పుష్పను చూపించి పుష్ప ఎక్కడున్నాడో చెప్పేశాడు సుకుమార్.