పుష్ప 2 జాతర అక్కడ షురూ… 172 కోట్ల దేవర ఓపెనింగ్సే టార్గెట్..

పుష్పరాజ్ గా రెండో సారి ఐకాన్ స్టార్ దూసుకొస్తున్నాడు. డిసెంబర్ 6 కాదు ఒకరోజు ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఎనౌన్స్ మెంట్ రాబోతోందట. అంతవరకు ఓకే కాని, పుష్ప 2 ముందు దేవర 172 కోట్ల రికార్డుంది... ఆ రికార్డుని బ్రేక్ చేసేలోపే 1000 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ అని అంచనాలను సడన్ గా పెంచేసింది ఫిల్మ్ టీం.

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 01:47 PM IST

పుష్పరాజ్ గా రెండో సారి ఐకాన్ స్టార్ దూసుకొస్తున్నాడు. డిసెంబర్ 6 కాదు ఒకరోజు ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఎనౌన్స్ మెంట్ రాబోతోందట. అంతవరకు ఓకే కాని, పుష్ప 2 ముందు దేవర 172 కోట్ల రికార్డుంది… ఆ రికార్డుని బ్రేక్ చేసేలోపే 1000 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ అని అంచనాలను సడన్ గా పెంచేసింది ఫిల్మ్ టీం. ఇక ముంబైలో ఏకంగా మాస్ జాతరనే ప్లాన్ చేస్తోంది. యూఎస్, ఆస్ట్రేలియా, కెనెడాలో పుష్ప 2 తాలూకు ప్రివ్యూలు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఏకంగా 200 కోట్ల ఓపెనింగ్స్ వచ్చేలా భారీ ఎత్తున పుష్ప 2 ని రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. అందుకోసం పుష్ప2 యూనిట్ ఏం చేస్తోంది? ప్రి రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్ తో సెన్సేషన్ ఎలా క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది?

రెబల్ స్టార్ కల్కీతో మాస్ జాతర చూపించాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియాని షేక్ చేశాడు. చేస్తూనే ఉన్నాడు. ఆతర్వాత నెంబర్ తనది అంటూ ప్రమోషన్ లోఎమోషన్ పెంచుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకు ముందు ముంబైనే టార్గెట్ చేశాడు. ఈవిషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర స్ట్రాటజీనే మక్కీకి మక్కీ ఫాలో అయ్యేలా ఉన్నాడు.

పుష్ప సీక్వెల్ పుష్ప 2 ప్రమోషన్ వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్స్ ని రంగంలోకి దింపుతున్నారు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మే కాదు, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ని కూడా ముంబైకి రప్పిస్తున్నారు. ముంబైలోనే పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతోంది. అంతేకాదు పుష్ప 2 మొదటి ప్రివ్యూ కూడా ముంబైలోనే ప్లాన్ చేశారు.

నిజానికి బన్నీ తన మూవీ ప్రివ్యూ హల్చల్ అయినా, ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా హైద్రబాదో,లేదంటే వైజాగ్ లోప్లాన్ చేసి, ఆతర్వాత ముంబై, చెన్నై ఇలా ప్రమోషన్స్ ని జరపాలి.. అలా కాకుండా ఓ తెలుగు హీరో అయ్యుండి ముందుగా ముంబైలోనే పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయటం వెనక దేవర స్ట్రాటజీనే ఉంది

దేవర టీం కూడా ముందుగా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ మార్కెట్ లో ప్రీరిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్లు చేసింది. ఆతర్వాతే హైద్రబాద్ లో ప్లాన్ చేయబోతే, పర్మీషన్స్ ప్రాబ్లమ్ వచ్చింది. ఐతే నార్త్ ఇండియాలో దేవర ప్రమోషన్స్ వర్కవుట్ అవటం వల్లే, ఉత్తరాదిన బాక్సాఫీస్ లో కలెక్షన్ల పూనకాలు పెరిగాయి.

సో తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ లేకున్నా వచ్చే వసూళ్ల వరద ఆగదు. కాబట్టి ముందుగా ముంబైలో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాలనేది సుకుమార్ ప్లాన్ అని తెలుస్తోంది. అందుకు డిసెంబర4 న తొమ్మిదిన్నరకు పుష్ప 2 ప్రివ్యూని ముంబైలో ప్లాన్ చేశారు.

ఇక ఐదో తేదీన ఉదయం ఒంటిగంటకు అంటే, అర్ధరాత్రి ఒంటింటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రిమీయర్ పడబోతోంది. అంటే సౌత్ తో పోలిస్తే, హిందీ పుష్ప 2 నాలుగు గంటల ముందే నార్త్ ఇండియాని కుదిపేస్తుంది… ఇలా చేయటానికి కారనం, అక్కడి ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమని మరింతగా ఎక్స్ ప్రెస్ చేయటమే అంటున్నారు. ఐతేనార్త్ బెల్ట్ మీద ముందునుంచే ఫోకస్ చేస్తే, నార్త్ ఇండియా వసూల్లతోనే కనీసం ఐదారు వందలకోట్లు రాబట్టొచ్చు… ఇది లెక్క

ఆల్రెడీ ప్రీరిలీజ్ బిజినెస్ తోనే 999 కోట్లు రాబట్టిన పుష్ప 2, ఫస్ట్ హాఫ్ అదిరిపోతుందని మ్యూజిక్ డైరెక్టర్ దేవ బాంబు పేల్చాడు. ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందన్న తన మాట, సోషల్ మీడియాలో తూటాలా మారింది. ఎక్స్ లో తను పోస్ట్ చేసిన ట్వీట్ వైరలైంది…ఇక నార్త్ ఇండియాలో పుష్ప 2 మూవీ 2 వేల స్క్రీన్స్ లో ప్లాన్ చేశారట

యూఎస్ లో 3వేల స్క్రీన్స్ , ఇలా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మూవీ ఏకంగా 6 వేల థియేటర్స్ లోరిలీజ్ అవ్వబోతోంది. 1000 కోట్ల పండగ కోసం సుకుమార్, బన్నీ టీం గట్టిగానే ప్లాన్ చేస్తోంది.