Pushpa 2-The Rule: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న పుష్ప-2 టీజర్‌.. బన్నీ మాస్‌ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా

శనివారం బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందుగా పుష్ప-2 ది రూల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 01:15 PM IST

Pushpa 2-The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పుష్ప-2 అప్‌డేట్ ఎట్టకేలకు ఏప్రిల్‌ 7, శుక్రవారం వచ్చింది. శనివారం బన్నీ పుట్టిన రోజును పురస్కరించుకుని పుష్ప-2 ది రూల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్‌ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటివరకు పుష్ప-2 తెలుగు టీజర్‌కు 19 మిలియన్ల వ్యూస్‌ రావడం విశేషం. ఇక దీనిని మించి హిందీ టీజర్‌కు ఏకంగా 22 మిలియన్ల వ్యూస్‌ రావడం మరో విశేషం. మొత్తానికి యూట్యూబ్‌లో రికార్డుల మోత షురు చేశాడు బన్నీ. ఈ చిత్రంలో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించాడు. ఎనిమిది బుల్లెట్లు తగిలి శేషాచలం అడవిలోకి తప్పించుకుపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్‌.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు. బన్నీ బర్త్‌డే సందర్భంగా టీజర్‌తో పాటు రిలీజైన మరొక ఫొటో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. పట్టు చీర కట్టుకుని, ముక్కుపుడక, బుట్ట కమ్మలు, చేతికి ఎర్ర రంగు గాజులు, మెడలో బంగారు గొలుసు, నిమ్మకాయల దండతో, ఎంతో గంభీరంగా గంగమ్మ రూపంలో ఉన్న బన్నీ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను స్వయంగా అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ లో షేర్‌ చేయడం విశేషం.