Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్.. రికార్డుల ఊచకోత

స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ (Star Director) సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కిన 'పుష్ప' (Pushpa) మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపేయడంతో పాటు వందల కోట్ల వసూళ్లతో సత్తా చాటింది.

స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) – క్రియేటివ్ డైరెక్టర్ (Star Director) సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశం మొత్తాన్ని ఊపేయడంతో పాటు వందల కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. స్టైలిష్ స్టార్ మానియాతో కంట్రీ మొత్తం ఊగిపోయింది.. అల్లు అర్జున్ మేనరిజానికి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.. ఈ సినిమాలోని మాస్ అండ్ ఎనర్జిటిక్ యాక్టింగ్‌కు అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. దీంతో.. పుష్ప-2(Pushpa2)పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి టైమ్‌లో పుష్ప 2 ట్రైలర్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇస్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పుష్ప-2 నుంచి వచ్చిన గ్లింప్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.. సో ఇప్పుడు ఫ్యాన్స్‌కు కిక్ అందించే న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో మరోసారి పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చి వదిలేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది..టీజర్ వచ్చాక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిమీద ఫోకస్ చేయనున్నట్టు గా తెలుస్తుంది. ఈ న్యూస్‌తో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అయిపోయారు. ట్రైలర్‌తో బన్నీ రికార్డుల ఊచకోత అప్పుడే ఖాయమంటూ హడావిడి మొదలు పెట్టేశారు.

టీజర్ వదలిని తర్వాత నుంచి ఒక్కో సాంగ్ ని కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక్కో స్టెప్‌తో సినిమాపై ఉన్న బజ్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాలని లెక్కల మాస్టారి ప్లాన్‌లా ఉంది. ఈ న్యూస్‌తో బన్నీ ఫ్యాన్స్‌ తగ్గేదేలే అంటూ సందడి చేస్తున్నారు. పుష్ప ను మించి పుష్ఫ-2 ఉండబోతోందంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.. ఇప్పటికే బయటకు వచ్చిన బన్నీ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. పుష్ప-2 భారీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.