PUSHPA 2 Vs KALKI 2898 AD: టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేస్తోంది. పుష్ప, దేవర, కల్కి, గేమ్ ఛేంజర్.. ఇలా నాలుగైదు సినిమాలు పాన్ ఇండియా దాడికి రెడీ అయ్యాయి. అయినా టాలీవుడ్ మార్కెట్‌ని నిర్లక్ష్యం చేయట్లేదు. లోకల్ మార్కెట్‌లో ఇవి క్రియేట్ చేసే సెన్సేషన్ మామూలుగా లేదు. దేవర రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ని దిల్ రాజు రూ.125 కోట్లు పెట్టి కొనేశాడు.
Akshay Kumar: అఫీషియల్.. అక్షయ్ వచ్చేశాడు.. మరి ప్రభాస్ మాటేంటి
ఎన్టీఆర్ గత చిత్రాలకు దక్కిన లెక్కతో పోలిస్తే ఇది డబుల్ అనుకోవాల్సిందే. తెలంగాణా 75, ఆంద్రా సీడెడ్ 50 కోట్లు లెక్కన సేల్ అయినట్టు కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో వందకోట్లకు సేల్ అయ్యింది. నైజాం వందకోట్లు, ఆంధ్రా, సీడెడ్ వందకోట్లు మొత్తంగా రెండు వందలకోట్లకి రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ అమ్ముడు పోయాయి. పుష్పరాజ్ థియేట్రికల్ రైట్స్ కూడా నైజాం, ఆంధ్రా కలిపి రెండు వందలకోట్లు పలికాయట. హిందీ రైట్స్ రూ.300 కోట్లంటున్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక రైట్స్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అవి కలుపుకొంటే కనీసం పుష్ప థియేట్రికల్ రైట్సే 700 కోట్లు దాటేలా ఉన్నాయి. పొరుగు రాష్రాల రైట్స్ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ఎమౌంట్ పరంగా చూస్తే కల్కి, పుష్ప తొలి రెండు స్థానాల్లో ఉంటే, ఆ తర్వాతి స్థానలో దేవర ఉంది.