PUSHPA 2: పుష్పరాజ్ మూడో వేట ఖాయం.. పుష్ప 3 విడుదల ఎప్పుడంటే..

పుష్ప 2 క్లైమాక్స్‌లో కూడా సంజయ్ దత్ విలనిజం చూపించబోతున్నాడట సుకుమార్. అంటే పుష్ప 2 ఎండ్‌లో వచ్చే సంజయ్ దత్.. పుష్ప మూడో సీక్వెల్‌లో విలనా అనే అనుమానాలు పెరిగాయి.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 07:47 PM IST

PUSHPA 2: పుష్పరాజ్ రెండో సారి పాన్ ఇండియాని షేక్ చేసేది ఆగస్ట్ 15నే. ఆ తేదీలో ఎలాంటి మార్పులేదు. ఐతే.. ఇందులో జరిగిన కొత్త మార్పు మాత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పెషల్ ఎంట్రీ కన్ఫామ్ చేయటమే. అవును కేజీయఫ్‌లో విలన్‌గా, లియోలో హీరో తండ్రిగా కనిపించిన సంజయ్ దత్, ఇప్పుడు పుష్పరాజ్‌కి విలన్‌గా మారబోతున్నాడు. పుష్ప 1లో ఎందరు విలన్లు ఉన్నా క్లైమాక్స్‌లో వచ్చిన భన్వర్ సింగ్ షెకావతే అసలైన విలన్ అని, పుష్ప 2లో తన విలనిజమే ఉండబోతోందని టీం హింట్ ఇచ్చింది.

GAAMI: పాన్ ఇండియా లెవల్‌లో ఆసక్తి రేపుతున్న గామి.. ఆ సినిమాల బాటలోనే..

అచ్చంగా అలానే పుష్ప 2 క్లైమాక్స్‌లో కూడా సంజయ్ దత్ విలనిజం చూపించబోతున్నాడట సుకుమార్. అంటే పుష్ప 2 ఎండ్‌లో వచ్చే సంజయ్ దత్.. పుష్ప మూడో సీక్వెల్‌లో విలనా అనే అనుమానాలు పెరిగాయి. ఏదేమైనా పుష్ప 3 కూడా ఉంటుందని కన్ఫామ్ అయ్యింది. పుష్ప 2 టాకీ పార్ట్ ఆల్‌మోస్ట్ మేజర్ సీన్స్ తెరకెక్కాయి. ఏప్రిల్ ఎండ్‌లోగా పెండింగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఇక అసలు ఆట మే ఃలో మొదలౌతుందట. అదే పుష్ప 3 పనులంటున్నారు. అవును ఆగస్ట్ 15న పుష్ప 2 రాబోతోంది. జూన్, జులై నెలంతా ప్రమోషన్‌కి వాడబోతున్నారు.

మే నెలలో మాత్రం పుష్ప 3 కథ తాలూకు పనులు పూర్తి చేసి, అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు షూటింగ్ ప్లాన్ చేశారట. అంటే ఈ ఏడాదంతా పుష్ప 2, పుష్ప 3 పనులే తప్ప బన్నీ మరో మూవీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 2025 సమ్మర్‌లో పుష్ప 3 వచ్చేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తోందని తేలుస్తోంది.