Pushpa 2: పుష్ప రాజ్ తగ్గేదే లేదంటున్నాడు. విడుదలపై మొన్నటి వరకు వినిపించిన పుకార్లకు బ్రేక్ వేశాడు. రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. డిసెంబర్‌లో, సంక్రాంతి సందళ్లో పుష్పరాజ్ వచ్చే ఛాన్స్ లేదంటే మరెప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. సమ్మర్‌కి పుష్పరాజ్ సందడి కన్ఫామ్ అయ్యింది. పుష్ప సీక్వెల్ షూటింగ్ 60శాతం పూర్తైందట. డిసెంబర్‌లోగా టాకీ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ పనులతో సుకుమార్ బిజీ కాబోతున్నాడట.
అంతవరకు ఓకే.. కాని మార్చ్ 22కి పవన్ ఫిక్స్ చేసుకున్నముహుర్తాన్ని బన్నీ లాగేసుకుంటున్నాడట. అదే మెగా-ఐకానిక్ వార్‌కి డోర్ తెరిచేలా ఉంది. సమ్మర్‌లో దేవర, కల్కి 2898 రాబోతున్నాయి. సో ఆ టైంలో పుష్ప-2 వస్తే ఇబ్బందే. అలాగని తర్వాత అంటే వేసవి సెలవుల్ని వదిలేసుకున్నట్టవుతుంది. అందుకే మార్చ్ 22 పర్ఫెక్ట్ టైం అని బన్నీ అండ్ కో నిర్ణయించారట. ఇక్కడ సీక్రెట్ ఏంటేంటే మార్చ్ 22 అనేది ఓజీ కోసం సుజిత్, త్రివిక్రమ్ డిసైడ్ చేసిన ముహూర్తమట. క్రిస్మస్.. లేదంటే సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్‌ని బరిలోకి దింపి, మార్చ్ 22కి ఓజీని రంగంలోకి దింపాలని నిర్మాతలతో మాట్లాడి తేల్చేసిందట ఫిల్మ్ టీం.
కట్ చేస్తే మార్చ్ 22ని పుష్ప-2 కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఒకే రోజు బన్నీ వర్సెస్ పవన్ అంటే అది సినిమా రైవల్రీ కాదు, పర్సనల్ రైవల్రీ అని కూడా అనుకోవాల్సి వస్తుంది. గతంలో చెప్పను బ్రదర్.. అని పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నబన్నీ, చరణ్‌తో కూడా గ్యాప్ మేయింటేన్ చేస్తున్నాడంటున్నారు. ఆ లెక్కన పవన్ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్న రోజున పుష్ప-2 ని ప్లాన్ చేస్తే ఇక కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్‌గా జనాలకు క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు.