PUSHPA 2: పుష్ప రాజ్ చాప్టర్ క్లోజ్ చేసిన రామ్ చరణ్

పుష్ప 2 ఆగస్ట్ 15న వస్తే అక్టోబర్ నుంచి సుకుమార్ పుష్ప 3 ప్లాన్ చేస్తాడనేంతగా ప్రచారం జరిగింది. నిజానికి సుకుమార్ కూడా రిస్క్ వద్దనే కొత్త ప్రాజెక్ట్ జోలికి పోకుండా, పుష్ప 2 కి సీక్వెల్ పుష్ప 3 ప్లాన్ చేశాడు.

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 07:59 PM IST

PUSHPA 2: పుష్ప రాజ్ ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా కొత్త రూల్‌తో వస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ నుంచి కనీసం వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టేలా ఉన్నాడు. అంత స్టామినా ఉన్న పుష్ప రాజ్ చాప్టర్‌నే క్లోజ్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ అన్నారు. కాదు.. ఆట్లీ ఆఫర్‌కి సై అన్న బన్నీ అన్నారు. ఇలా చాలా రూమర్స్ వచ్చినా, చివరికి పుష్ప 3నే పట్టాలెక్కుతుందని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు.

SSMB 29: రాజమౌళి-మహేశ్ సినిమా.. అప్పటిదాకా ఆలస్యమే..

పుష్ప 2 ఆగస్ట్ 15న వస్తే అక్టోబర్ నుంచి సుకుమార్ పుష్ప 3 ప్లాన్ చేస్తాడనేంతగా ప్రచారం జరిగింది. నిజానికి సుకుమార్ కూడా రిస్క్ వద్దనే కొత్త ప్రాజెక్ట్ జోలికి పోకుండా, పుష్ప 2 కి సీక్వెల్ పుష్ప 3 ప్లాన్ చేశాడు. లేదంటే బుచ్చి బాబుతో రామ్ చరణ్ సినిమాకు తనెందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆతర్వాతే చరణ్ తో సుకుమార్ మూవీ ఎందుకు ప్లాన్ చేసుకుంటాడు. తనే చరణ్‌తో సినిమా తీయాలనుకుంటే, బుచ్చి బాబు కంటే ముందే గ్లోబల్ స్టార్‌తో సినిమా కమిటయ్యేవాడు. సో ఈ లాజిక్ ప్రకారం చూస్తే పుష్ప 3 నిజంగానే ప్లాన్ చేశారు.

కాని శంకర్ సినిమా లేటవటం, బుచ్చి బాబు మూవీ తర్వాత లోకేష్ సినిమా చేయాలంటే చరణ్ రెండేళ్లు ఆగాల్సి రావటంతో వళ్ల ఆ గ్యాప్‌లో ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చిరునే సుకుమార్‌కి ఐడియా ఇచ్చాడట. అలా సుక్కు-చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఫలితంగా పుష్ప 3 ప్రస్తుతానికి ఆగినట్టుంది. ఒకవేళ ఇది మళ్లీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంటే 2026 తర్వాతే.