Pushpa: దుకాణం సర్దేస్తున్న రష్మిక.. 2023 తర్వాత “GET OUT”..?

రష్మిక మందన్న టాలీవుడ్ లో దుకాణం సర్ధేశే టైం వచ్చిందా? వచ్చే ఏడాది తర్వాత తనని గెట్ ఔట్ అనేస్తారా? ఇవేవో ఊరికే వచ్చిన డౌట్లు కాదు.ఈ హీరోయిన్ ఫేట్ ఫేట్ అవుట్ అయ్యే టైం వచ్చినట్టుంది.. దానికి సాలిడ్ రీజనుంది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 06:00 PM IST

పుష్ప 2 డిసెంబర్ లోగా పూర్తవుతుంది. అది ఎంత హిట్టైనా బన్నీకి, సుకుమార్ టీం కి లాభం. కాని రష్మికకు కొత్తగా వచ్చే ఐడెంటిటీ లేదు. ఇక నితిన్ తో జోడీకట్టిన సినిమా తప్ప తెలుగులో పెద్ద ప్రాజెక్ట్ లేదు. హిందీలో యానిమల్ అంటూ రణ్ బీర్ తో జోడీకట్టింది. తెలుగు బన్నీ, మహేశ్ తో జోడీకట్టింది. సో ఇప్పుడున్నట్రెండ్ ప్రకారం హీరోయిన్ రిపీట్ అవటం కష్టం కాబట్టి బన్నీ, మహేశ్ తోమళ్లీ జోడీ చాన్స్ ఊహించలేం.

ప్రభాస్ కి హైట్ పరంగా సూట్ కాదు, చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ కోసం అక్కడి లోకల్ బ్యూటీస్ కే సై అంటున్నారు. పవన్ తో రష్మిక జోడీ ఊహించే పరిస్థితిలేదు. అసలు తను కమిటైన మూవీలే పూర్తవటానికి ఏడాది పడుతుంది. అది కూడా పొలిటికల్ బ్రేక్స్ పడక పోతే.. సో 2024 వచ్చే సరికి టాలీవుడ్ రష్మక క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టే, తమిల్ లో మురుగదాస్ శిష్యుడి మూవీ, లవ్ టుడే డైరెక్టర్ తో ఓ సినిమా ఇలా ఏకంగా 5 సినిమాలు ప్లాన్ చేసుకుంది. సీన్ చూస్తుంటే విజయ్ తో జోడీకట్టి చేసిన వారసుడు ఫ్లాపైనా, కార్తితో చేసిన సుల్తాన్ డిజాస్టర్ అయినా, తమిళనాడునే తన నెక్ట్స్ డెస్టినేషన్ గా మార్చుకుంటోందనే కామెంట్లు పడిపోతున్నాయి. తన స్టోరీ సెలక్షన్ చూస్తే ముందే జాగ్రత్త పడుతుందనంటున్నారు.