బాహుబలి 2 కి, దేవర1 కి మధ్య…. నలిగిపోతున్న పుష్పరాజ్..

ఏదైనా వస్తువుని రైలు పట్టాలు, రైలు చక్రాల కింద పెడితే ఏమౌతుంది.. అచ్చం అలాంటి పరిస్థితే దేవర, బాహుబలి సినిమా వల్ల పుష్ప 2కి ఎదురౌతోంది. ఐకాన్ స్టార్ కి పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ తక్కువే లేదు. తన మార్కెట్ కి వచ్చి ఇబ్బంది ఏం లేదు.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 07:13 PM IST

ఏదైనా వస్తువుని రైలు పట్టాలు, రైలు చక్రాల కింద పెడితే ఏమౌతుంది.. అచ్చం అలాంటి పరిస్థితే దేవర, బాహుబలి సినిమా వల్ల పుష్ప 2కి ఎదురౌతోంది. ఐకాన్ స్టార్ కి పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ తక్కువే లేదు. తన మార్కెట్ కి వచ్చి ఇబ్బంది ఏం లేదు. ఐనా బాహుబలి రెండో భాగం, దేవర మొదటి భాగం మధ్యలో పుష్ప సీక్వెల్ నలిగిపోతోంది. బాహుబలి 1 తర్వాత వచ్చిన బాహుబలి 2 లా పుష్ప 2 ని పోల్చే పరిస్తితి లేదు.. అలాని దేవర లా పుష్ప 2 మూవీది మొదటి ఎటాక్ కాదు. అక్కడే విచిత్రమైన సమస్య బన్నీకి ఎదురౌతోంది. దేవర వల్లే ఎక్కువగా పుష్ప2 కి తలనొప్పులు మొదలయ్యాయి. ఆల్రెడీ రిలీజై హిట్టైన మూవీ అలా ఎలా పుష్ప 2ని ఇరుకున పెడుతుంది? 

పుష్ప 2 కి బాహుబలి 2 కి ఎలాంటి సంబంధం లేదు. దేవరతో అసలు పోలికే లేదు. కాని ఆరెండు హిట్లు పుష్పరాజ్ ని తగ్గేలా చేస్తున్నాయి. అస్సలు తగ్గేదేలేదన్న తను ఈ రెండు మూవీల మధ్య నలిగిపోయే పరిస్థితి వచ్చింది. బేసిగ్గా ఓ మూవీ విడుదలౌతోంది అంటే, పోటీకి భారీ మూవీలొచ్చి నలిపేస్తే, నలిగిపోతుందనంటారు

కాని బాహుబలి 2 ఎప్పుడో వచ్చిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేవర కూడా సెప్టెంబర్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఈ రెండూ ఎలా కూడా పుష్ప2 కి పోటీ కానే కాదు. అలాంటప్పుడు ఈ రెండుమూవీల కింద పుష్ప2 నలగటం అనేదే విచిత్రం.. డెఫినెట్ గా ఆల్రెడీ విడుదలై వసూళ్లతో వండర్స్ చేసిన ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు పుష్ప2 ని నలిపేయటం వెనక కొండంత లాజిక్ షాక్ ఇస్తోంది.

నిజానికి పుష్ప2 ఎప్పుడో ఏడాది క్రితం రావాల్సిన సినిమా.దేవర కంటే ముందే రిలీజై పాత బడాల్సిన సినిమా… అలాంటి మూవీ, ఇప్పుడు ఏడాదిన్నర టైంగ్యాప్ తర్వాత రాబోతోంది. అదే అసలు సమస్య.

బాహుబలి 2 కూడా రెండేళ్లనుకుంటేమూడేళ్లు తీశారు… బాహుబలి 1 వచ్చిన తర్వాత రెండున్నరేళ్లు లేదంటే మూడేళ్లు టైం తీసుకుని తీస్తే, అదొచ్చి దుమ్ముదులిపింది. అలా చూస్తే పుష్ప వచ్చిన మూడేళ్లకు పుష్ప 2 రాబోతోంది. పుష్ప 1 హిట్టైందని పుష్ప 2 కూడా బాహుబలి 2 రేంజ్ లో దుమ్ముదులిపే సీన్ ఉందనలేం. అలాని తక్కువ చేసి చూడలేం.. కాని బాహుబలి 2 రేంజ్ లో ఆ క్యూరియాసిటీని పుష్ప 2 మూవీ కాపాడుకోలేకపోతోంది. మరీ ఎక్కువ సానబెడితే పెన్సిల్ ముల్లు విరిగినట్టు సుకుమార్ అతి చెక్కుడు, విలువైన కాలాన్ని కరిగిస్తోందనే కామెంట్లు పెరిగాయి

ఇదే కాదు దేవర కూడా ఓరకంగా పుష్ప2 కి భారంగా మారింది. వెట్టయాన్ నుంచి స్ట్రీ వరకు పోటీకి ఎన్నిమూవీలు వచ్చినా వాటిని దేవర పక్కకు నెట్టుకుంటూ పోయాడు. థౌైజెండ్ వాలాగా మారాడు. కాని పుష్ప2 కి డిసెంబర్ 5న పోటీనే లేదు. బాలీవుడ్ మార్కెట్ లో పోటీ ఇస్తుందనకున్న చావా మూవీ కూడా వాయిదా పడింది.. 11500 థియేటర్స్ వస్తోంది కాబట్టి, ఇంతగా కాలం కలిసొచ్చినా 1000 కోట్ల వసూళ్లు రాకున్నా, లేటుగా వచ్చినా పుష్ప 2 ని సెన్సేషన్ గా కన్సిడర్ చేయరు..

అందుకే బాహుబలి 2 తో పోలికలు పుష్ప2 మీద అదనపు భారంగా మారటం, ఆరేంజ్ హైప్ ఈ సీక్వెల్ కి లేకపోవటం, దేవర లా చాలా సినిమాలతో పోటీ పడి గెలవాల్సిన పరిస్థితులు లేకపోవటంతో, పుష్పరాజ్ ఏమాత్రం తగ్గనా నెగ్గటం కష్టమనే కోణం టీం ని కంగారు పెడుతోంది.