ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలు హిందీలో విడుదల కావాలంటే యూట్యూబ్ లో విడుదలయ్యే పరిస్థితి ఉండేది. ఎప్పుడో గాని ఒక పెద్ద సినిమా వస్తే మినహా పెద్దగా నార్త్ ఇండియాలో మన సినిమాల ప్రభావం ఉండేది కాదు. మన సినిమాలను అసలు సినిమాలే కాదు అన్నట్టు నార్త్ బలుపు ఉండేది. వాళ్ళను వాళ్ళు ఊహించుకుని కాలర్ ఎగరేసేవారు. మన తెలుగు వాళ్ళు కూడా అసలు సినిమాలు మనవి కాదు… మన వాళ్ళు హీరోలే కాదన్నట్టు ఫీల్ అయ్యేవారు. కానీ పాన్ ఇండియా సినిమాల పేరుతో ఇప్పుడు నార్త్ ఇండియాను మన తెలుగు సినిమా తొక్కి నార తీస్తోంది.
ఒకరకంగా మన సినిమాలు వాళ్ళను మెంటల్ టార్చర్ చేస్తున్నాయనే చెప్పాలి. అవును ఒకప్పుడు ఇండియా మొత్తం తమదే అనుకుని విర్రవీగిన బాలీవుడ్ కు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది తెలుగు సినిమా. దీనితో కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు అక్కడి స్టార్ హీరోలు. ఒకప్పుడు అక్కడి స్టార్ నిర్మాతలు మన తెలుగులో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఒకరకంగా డామినేషన్ చూపించేవాళ్లు. అయితే క్రమంగా ఆ పరిస్థితి ఇప్పుడు నార్త్ ఇండియాలో మన తెలుగు హీరోలు చూపించడం మొదలుపెట్టారు.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్ 2 విషయంలో బాలీవుడ్ హీరోలకు చుక్కలు కనపడుతున్నాయి. అక్కడ నిర్మాతలు కూడా ఇప్పుడు పుష్ప 2 విషయంలో సీరియస్ గానే కనబడుతున్నారు. ఈ రేంజ్ లో హిందీలో పుష్ప సినిమా సక్సెస్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాకు క్రేజ్ ఉందని ఊహించారు గాని ఈ రేంజ్ లో ఉందని అంచనాలు కూడా వేయలేదు. పాట్నాలో ఆ రేంజ్ లో జనాలు వస్తే బీరు బిర్యానీ అనుకున్నారు గాని ఈ రేంజ్ లో సినిమాను అక్కడి జనాలు ఆదరిస్తారని అసలు ఏమాత్రం ఊహించలేదు.
బాలీవుడ్ స్టార్ హీరోలు దీనితో ఇప్పుడు పుష్ప సినిమాను ఇబ్బందులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి వరకు కచ్చితంగా పుష్ప సినిమా డామినేషన్ కంటిన్యూ చేసే ఛాన్స్ కనబడుతోంది. అక్కడ స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా సరే ఈ సినిమా డామినేషన్ కనబడటంతో… నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాను కంప్లీట్ గా ఆపేయాలని బాలీవుడ్ చిన్న సినిమాలను ప్రదర్శించాలని కోరుతున్నారట. వాస్తవానికి బడా నిర్మాతలు బాలీవుడ్ చిన్న సినిమాలు ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఇప్పుడు మాత్రం పుష్ప సినిమా దెబ్బకు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇక పుష్ప దెబ్బకు తెలుగు సినిమా దమ్ముంటే బాలీవుడ్ జనాలకు స్పష్టంగా అర్థమైంది. దీనితో ఫ్యూచర్లో తెలుగు సినిమాల రిలీజ్ విషయంలో కచ్చితంగా కఠినంగానే అడుగులు వేయాలని అక్కడి నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీనితో కొన్ని రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లను తమ కంట్రోల్ లోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు స్టార్ నిర్మాతలు.