Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర.. !

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. 'పుష్ఫ 2 ది రూల్‌' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. ‘పుష్ఫ 2 ది రూల్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది

‘పుష్ప 2’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ రాబోతుందట. సంక్రాంతికి మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. పోస్టర్ తో పాటు ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేయనున్నారట. పవర్ ఫుల్ వీడియో ఒకటి వదిలి.. సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రకటన ఏమీ రాలేదు కానీ వస్తుందని నమ్ముతున్నారు. అదే కనుక జరిగితే మామూలుగా ఉండదు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోన్న పుష్ప 2ను.. చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. గత కొత్త కాలంగా అనివార్య కారణాలతో షూటింగ్ కు వాయిదా పడగా.. త్వరలో కొత్త షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్లతో పాటు అదిరిపోయే ఎమోషనల్ ఎపిసోడ్ ను తెరకెక్కించబోతున్నారట. ఇటు సుకుమార్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి రిలీజ్ తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.