Pushpa2 song : గూస్ బంప్స్ తెప్పించేలా పుష్పరాజ్ ఫస్ట్ సింగిల్

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' (Pushpa) పేరు మోతమోగిపోతోంది. ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప’ (Pushpa) పేరు మోతమోగిపోతోంది. ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. అంతకుమించిన సంచలనం సృష్టించడానికి ‘పుష్ప-2’ తో రాబోతుంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పుష్ప సాంగ్ వచ్చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంద.

టీజర్‌తో అందరిలో మంచి అంచనాలు పెంచి తాజాగా విడుదల చేశారు.పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్” అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. చంద్రబోస్ కూడా పదునైన లిరిక్స్ తో మరోసారి తన కలం బలం చూపించాడు. ఈ సాంగ్ బన్ని ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఆస్కార్ విన్నర్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) అదిరిపోయే మ్యాజిక్ అందించారు. పాట విడులకు ముందే ఫ్యాన్స్‌, ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచడంతో తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్‌పై కొంత ప్రభావం పడింది అని చెప్పవచ్చు. అయితే పాటలోని అర్థం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక మనిషి పుష్పలా ఎలా ఎదగాలో చెప్పే ప్రయత్నం చేశాడు పాటల రచయిత.

ఇక లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్టెప్పులు, మ్యానరిజమ్స్ హైలైట్ గా నిలిచాయి. టీ గ్లాస్ పట్టుకొని బన్నీ వేసిన స్టెప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ‘పుష్ప-1’లో ‘తగ్గేదేలే’ అన్న అల్లు అర్జున్.. ఈసారి ‘అసలు తగ్గేదేలే’ అంటూ సర్ ప్రైజ్ చేశాడు.చీకట్లను చీల్చే అక్షరకిరణాలతో శ్రోతల బ్రైన్లో పయనిస్తాడు చంద్రబోస్. అలాంటి మోటివేషనల్ సాంగ్స్ ఆయన చాలానే రాశారు. పుష్ప మొదటి పార్ట్‌లో కథనాయకుడిని ఎం చేసిన అందులోనే తిరుగులేకుండా ఎదుగుతాడు అని.. ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటలో చెప్పారు. ఇక ఇందులో పుష్ప ఎదిగిన తీరు చెబుతూనే అతని విజయానికి కొలమానం లేదని రాశాడు. వానలో తడుస్తూ గువ్వలా వణిపోవడం నీ తప్పు, గద్దాల మబ్బులను దాటి విహరించు ఆ వర్షం నీ కాళ్ల కింద ఉంటుందని రాశాడు.

ఇక పుష్ప ఎత్తును తాకలాంటే ఆకాశం ఇంకా ఎదగాలి, పుష్పను కోలవాలంటే సముద్రం ఇంకా లోతుకు వెళ్లాలి అని అద్భుతమైన లైన్లు రాశాడు. పాటలో కొన్ని డిటైల్స్ కూడా ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకోసం, పుష్ప ధరించే షర్ట్స్, గోల్డ్ కాయిన్స్‌పై అతని బ్రాండ్ ఉండేలా హ్యాండ్ సింబల్ ఉంటుంది. ఇక మొత్తానికి ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు.