పుష్ప 2 కు స్లోగా బజ్ పీక్స్ కు తీసుకెళ్తున్నాడు ఐకాన్ స్టార్. మార్కెటింగ్ స్కిల్స్ ను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ బాక్సాఫీస్ పై యుద్దానికి గొడ్డలి నూరుతున్నాడు. సినిమాపై ట్రోల్ చేసినా తన మార్కెటింగ్ స్కిల్ తో నిలబెట్టాలని వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలని బన్నీ ప్లాన్ చేసాడు. మార్కెటింగ్ లో బన్నీకి బ్యాక్ బోన్ గా నిలుస్తున్న భార్య స్నేహా రెడ్డి ఇప్పుడు సినిమా కోసం అన్ని విధాలుగా ప్లాన్స్ బయటకు తీస్తోంది. విడుదలకు ముందే క్రికెటర్లతో ప్రచారం చేయించాలని ప్లాన్ చేయిస్తోంది. దీనితో సుకుమార్ కూడా ట్రైలర్ కట్ పై గట్టిగా వర్క్ చేస్తున్నాడు.
మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్ ట్రోల్ చేయడం షురూ అయింది. అందుకే వార్ ను గట్టిగా ఫేస్ చేయడానికి స్కెచ్ గీసాడు. హిమాలయాల నుంచి బంగాళాఖాతం వరకు… అమెరికా నుంచి అమలాపురం వరకు బాక్సాఫీస్ కు తన దమ్ము ఏంటో చూపించడానికి రెడీ అయిపోయాడు. దేవర సినిమా ఇప్పుడు ప్రీ బుకింగ్ మార్కెట్ తో బన్నీకి టార్గెట్ పెట్టింది. ఎన్టీఆర్ ఫ్రెండ్ అయినా సరే కనికరం లేకుండా యుద్ధం చేస్తేనే ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. అందుకే అమెరికాలో ఈవెంట్ ను ప్లాన్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రీ బుకింగ్ మార్కెట్ కోసం స్కెచ్ గట్టిగా గీస్తున్నాడు.
కనీసం 3 మిలియన్ డాలర్ల వసూళ్లు ఉండాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో డేవిడ్ వార్నర్ కు బాధ్యతలు అప్పగించాడు బన్నీ. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఉంది. ట్రైలర్ ను డేవిడ్ భాయ్ ఆస్ట్రేలియా ప్రమోట్ చేస్తే ఆ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా ఉంటుంది. అలాగే న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్రతో కూడా పుష్ప టీం మాట్లాడుతోంది. త్వరలోనే రచిన్ కూడా పుష్ప ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడని టాక్. ఈ టైం లో బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు ఫ్యాన్స్ కు పిచ్చి ఎక్కిస్తోంది.
పుష్ప 2 లో ఐటెం సాంగ్ ను గ్రాండ్ గా సుక్కు ప్లాన్ చేసాడు. పుష్ష 1’లో ‘ఊ అంటావా మావ ఊ.. ఊ అంటావా’ సాంగ్ తో ఇండియాలో మ్యూజిక్ ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ సాంగ్ లో సమంతా స్టెప్స్ కుర్ర కారుని ఊపేశాయి. ఇప్పుడు పార్ట్ లో శ్రద్దా కపూర్ తో ప్లాన్ చేసారు ఈ సాంగ్. చంద్రబోస్ ఇప్పటికే పాట రాసాడట. త్వరలోనే సాంగ్ షూటింగ్ కూడా మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. శ్రద్దా ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకుందని టాక్. ముందు జాన్వీ కపూర్ అనుకున్నా శ్రద్దా అయితేనే బాగుంటుందని సుక్కు ఫైనల్ చేసాడట.