దేవర కంటే 5 రెట్లా..? బాహుబలి 2 కంటే 2 రెట్లా..? USలో400 కోట్ల అతి..

దేవర ఓవర్ సీస్ లో మరీ ముఖ్యంగా యూఎస్ లో 8 మిలియన్లు రాబట్టింది. కెనడా, ఆస్ట్రేలియాతో కలుపుకుని 10 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇక 22 మిలియన్ల అమెరికా వసూళ్ల రికార్డుతో బాహుబలి 2 ఇప్పటికి టాప్ ప్లేస్ లో ఉంది.

  • Written By:
  • Publish Date - November 21, 2024 / 04:56 PM IST

దేవర ఓవర్ సీస్ లో మరీ ముఖ్యంగా యూఎస్ లో 8 మిలియన్లు రాబట్టింది. కెనడా, ఆస్ట్రేలియాతో కలుపుకుని 10 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇక 22 మిలియన్ల అమెరికా వసూళ్ల రికార్డుతో బాహుబలి 2 ఇప్పటికి టాప్ ప్లేస్ లో ఉంది. ఇంతవరకు బాహుబలి 2 రికార్డుని మరే మూవీ టచ్ చేయలేకపోయింది. అలాంటిది, పుష్ప2 రిలీజ్ కి ముందే 50మిలియన్లు రాబట్టే ప్రయత్నాలంటున్నారు. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి, ఆటోమేటిగ్గా అంచనాలు ఆకాశాన్నంటుతాయి.. అలాని అమెరికాలో 50 మిలియన్లు… అంటే ఆల్ మోస్ట్ 400 కోట్లు వసూళ్లంటే, కాస్త అత్యాశే.. అలా బిజినెస్ ప్లాన్ చేయటమే కామెంట్లకు దారితీస్తోంది.. ఇంతకి పుష్ప2 కి యూఎస్ లో 4 వందలకోట్ల సీనుందా?

దేవర యూఎస్ లో 8 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వసూళ్లతో కలుపుకుని పది మిలియన్ డాలర్లు వసూళు చేసింది దేవర. అలాంటి దేవరకి 5 రెట్లు వసూళ్లని టార్గెట్ చేసుకుంది పుష్ప2 టీం. కేవలం యూఎస్ లోనే 50 మిలియన్ల వసూళ్లని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది

కేవలం టార్గెట్ చేసుకుంటేనే వసూళ్లు వస్తాయా అంటే, రావు.. సినిమాలోమ్యాటర్ ఉంటే, అది జనాలకు బాగా ఎక్కితే, పది కాదు ఇరవై ముప్పై మిలియన్లైనా వచ్చేస్తాయి.. కాని ఏకంగా 50 మిలియన్ డాలర్ల వసూళ్ల మీద ఫిల్మ్ టీం ఫోకస్ చేయటం కాస్త అత్యాశలా ఉందంటున్నారు

పుష్ప హిట్టైంది. కాబట్టి పుష్ప 2 మీద డెఫినెట్ గా అంచనాల భారం ఉంటుంది. అలాని చెప్పి 50మిలియన్ డాలర్లు అంటే, 400 కోట్లు కేవలం యూఎస్ నుంచే రాబట్టడం సాధ్యమా? ప్రాక్టికల్ గా కాస్త అతి అనిపించట్లేదా అనంటున్నారు. పుష్ప2 బడ్జెట్టే 400 కోట్లు ఆ వసూల్ల యూఎస్ లో వస్తే, ఇక ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ లో వచ్చే వసూళ్లన్న బోనస్సే.

రిలీజ్ కి ముందే 900 కోట్ల వరకు పుష్ప2 ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఆ లెక్కలు కూడా ఇంకా క్లియర్ గా ఎంతవరకు నిజమో తేలలేదు. ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు కాని, మరి 1000 కోట్ల సీన్ ప్రబాస్ కే రాలేదు… కాబట్టే డౌట్లు పెరుగుతున్నాయి

ఇవన్నీ కాదు, ఇంతవరకు యూఎస్ లో 22 మిలియన్ల తో బాహుబలి 2నే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. త్రిబుల్ ఆర్, కల్కీ, జవాన్, పటాన్, కేజీయఫ్, సలార్ ఏవి కూడా ఈ రికార్డుని టచ్ చేయలేదు. దరి దాపుల్లోకి వెళ్లలేదు. అలాంటిది బాహుబలి 2 తాలూకు 22 మిలియన్లు అంటే, 180 కోట్ల యూఎస్ వసూళ్లకంటే రెండింతలు పుష్ప2 రాబడుతుందా? ఇది మరి హైప్ పెంచేందుకు అతిగా ఊహించుకోవటమేనా? ఇలా చేస్తే అంచానాల భారం పెరిగి, ఏమాత్రం టాక్ వీకైనా, అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ఉంది.