ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో సారి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేందుకు పుష్పరాజ్ గా ఎటాక్ చేయబోతున్నాడు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా దాడి కి రెడీ అయ్యాడు. ఆల్రెడీ పాటల ప్రమోషన్, ప్రీరిలీజ్ అప్ డేట్ల ప్రమోషన్ తో సెన్సేషన్ షురూ అవుతోంది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఓ సినిమా ప్రమోషన్ కి వందకోట్లు ఖర్చుచేయబోతున్న టీం గా పుష్ప 2 టీం రికార్డు క్రియేట్ చేస్తోంది. నిజానికి ఇది కొత్త కాదు, కొత్త విషయం కాదు, కేజీయఫ్ సీక్వెల్ కి 45 కోట్ల వరకు ఖర్చు చేశారు… సలార్, త్రిబుల్ ఆర్ కోసం కూడా అంతకుమించేలా ప్రమోషన్ కోసమే ఖర్చు చేశారు. ఆలా చూస్తే పుష్ప 2 ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ ప్రమోషన్ కోసం ఎంత ఖర్చైందో అంతకుమించి, సలార్, కల్కీ టీం ఖర్చు పెట్టిన దానికంటే కూడా భారీ మొత్తంలో పుష్ప 2 టీం ఖర్చు చేయబోతోంది. సినిమా బడ్జెట్ లో 25 శాతం ప్రమోషన్ కే పెట్టబోతోంది. అంటే సినిమా ప్రమోషన్, హీరో రెమ్యునరేషన్, గ్రాఫిక్స్ వదిలేస్తే 550 కోట్లు సినిమాలో, 150 కోట్లే అసలు మేకింగ్ బడ్జెట్ అని తెలుస్తోంది… ఇంతకి ఏంజరుగుతోంది? ఇంత ఖర్చు తో ప్రమోషన్ దేనికి?
పుష్ప రాజ్ రెండో సారి పాన్ ఇండియాని షేక్ చేయాలంటే కనీసం వందకోట్లు ఖర్చు చేయాల్సిందే… కేవలం నార్త్ ఇండియాలో ప్రమోషన్ కే 70 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇక సౌత్ ఇండియాలో పుష్ప 2 ప్రమోషన్ కి 10 కోట్లు.. ఇక యూఎస్, యూకే, ఆస్ట్రేలియా,యూరప్ లోప్రమోషన్ కి 20 కోట్లు కేటాయించారట… ఇది కాకుండా కొరియా, జపాన్ లో ఈసినిమా సమ్మర్ లో విడుదలయ్యేఛాన్స్ఉంది
ఇక్కడ డిసెంబర్ లో అక్కడ సమ్మర్ లో పుష్ప రాజ్ దూసుకెళ్లబోతున్నాడు. అందుకోసం అదనంగా మరో పది కోట్లు ప్రమోషన్ కి ఖర్చు పెట్టబోతున్నారు. ఇదంత దేనికి? 110 కోట్ల వరకు దేశ, విదేశాల్లో పుష్ప 2 ని ప్రమోట్ చేయటానికి ఖర్చు చేయటం అవసరామా?
ఇది బేసిక్ ప్రశ్న,..? కాని అవసరమే? పుష్ప 2 ప్రమోషన్ కి పెట్టే 100 నుంచి 110 కోట్ల ఖర్చుతో ఓ మీడియం రేంజ్ భారీ బడ్జెట్ మూవీ తీయొచ్చు… ఆల్రెడీ పుష్ప 2 కి మొదట్లో అనుకన్న 350కోట్ల బడ్జెట్ మించి 450 కోట్లు ఖర్చయ్యింది. దీనికి మరో 110 కోట్ల ఖర్చంటే మొత్తంగా 560 కోట్ల వరకు నిర్మాతల జేబుకు చిల్లు పడుతుంది
అయినా నష్టం లేదు… ఖచ్చితంగా ఆ ఖర్చుకు అర్ధముంది. ఎందుకంటే పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు జీరో ప్రమోషన్ చేశారు… అసలు రిలీజ్ డేట్ వరకు కూడ నార్త్ ఇండియాలో ఈ సినిమా వస్తోందని ఎవరికీ తెలియదు. కాని ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ట్రెండ్ సెట్ చేసింది. క్రికెటర్లు కూడా పిచ్చి పిచ్చిగా ఫాలో అయ్యేలా, పొలిటీషియన్స్ ఇచ్చే స్పీచ్ లో మాటల తూటాల్లా మారింది. అంతగా పుష్ప రాజ్ పాత్ర జనాల్లోకి వెళ్లింది.
అదే పుష్పకి సాలిడ్ ప్రమోషన్ చేసినఉన్నట్టైతే, 450 కోట్ల వసూళ్లు కాస్త వెయ్యికోట్లని రీచ్అయ్యుండేవి.. ఆతప్పే ఈసారి జరగొద్దని, ముందుగా ముంబై, కోల్ కత, డిల్లీ, లక్నౌ, పంజాబ్, హర్యాన తోపాటు, బీహార్, జార్కండ్, గుజరాత్ లో ప్రత్యే కఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళాతోపాటు, యూఎస్, యూకే, యూరప్, ఆస్ట్రేలియాలో కూడా భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు
ఇదంత కంపల్సరీనా అంటే, అవసరమే.. కేజీయఫ్ మూవీ హిట్ అయ్యాక, కేజీయఫ్ 2 రిలీజ్ కిముందు కనీసం 50 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రమోట్ చేయమని రాజమౌళి సలహా ఇచ్చాుడ. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ తో నిర్మాతలు అదే పని చేశారు. కట్ చేస్తే కేజీయఫ్ 1250 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంతెందుక త్రిబుల్ ఆర్ ప్రమోషన్ కి 60 కోట్లు ఖర్చు చేసిన టీం, ఆస్కార్ వేటలో ప్రమోషన్ కి 80 కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది..
సో ఇక్కడ ఓ సినిమాలో మ్యాటర్ ఉంటే వందకోట్లొచ్చే దగ్గర ప్రమోషన్ వల్ల అందుకు పదిరెట్లు అంటే వెయ్యికోట్ల సీన్ వచ్చేస్తుంది. అదే కేజీయఫ్, త్రిబుల్ ఆర్, సలార్,యానిమల్ విషయంలో ప్రూవ్ అయ్యింది. కాబట్టే పుష్ప 2 టీం 100 నుంచి 110 కోట్లు కేవలం సినిమా ప్రమోషన్ కే వాడబోతోంది.