Raghava Lawrence: సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో, మల్టీ టాలెంట్‌తో పైకొచ్చిన వాళ్ల గురించి మాట్లాడాలంటే.. రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తుంది. ఒక చిన్న డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తరువాత కొరియోగ్రాఫర్‌గా.. హీరోగా.. దర్శకుడిగా రాణించిన లారెన్స్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. నిజానికి లారెన్స్‌ది ఒక గ్రేట్ జర్నీ. తెలుగు, తమిళ సినిమాల్లో ఆయన అలరిస్తున్నాడు. అంతేకాదు.. లారెన్స్ మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు.
JD Lakshminarayana: ఏపీలో జేడీ కొత్త పార్టీ ! పోటీ ఎక్కడి నుంచంటే.
ఒక ట్రస్ట్ పెట్టి ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేయించి పునర్జన్మ ఇచ్చాడు. అంతే కాకుండా అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడమే కాకుండా వారి మంచి చెడుల బాధ్యతను సైతం ఆయనే తీసుకున్నారు. అలాంటి లారెన్స్‌కు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్న రాఘవ.. చిన్నప్పుడు ఇలాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి బయట పడ్డాడట. లారెన్స్ తన చిన్నతనంలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడ్డారట. ఆయనను బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఎన్నో చోట్ల చికిత్స చేయించినా వ్యాధి నయం కాలేదట.
దీంతో.. లారెన్స్ తల్లి శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ, మరోవైపు తన కొడుకుకు చికిత్స అందించడంతో ఈ వ్యాధి తగ్గిపోయిందని తెలుస్తోంది. దాంతో వీరి ఫ్యామిలీ అంతా శ్రీరాఘవేంద్రుడికి భక్తులుగా మారిపోయారు. తన పేరుకు రాఘవ అని తగిలించుకున్నాడు లారెన్స్. అందుకే.. తాను చిన్నప్పుడు పడిన బాధ, తన తల్లి పడ్డ యాతన ఇంక ఏ చిన్నారీ పడకూడదన్న ఉద్దేశంతో.. చిన్నారులకు ట్రీట్మెంట్ చేయించి కాపాడటం స్టార్ట్ చేశాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.