సినిమాను కమర్షియల్ చేసి.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన దర్శకుడు రాఘవేంద్రరావు.. దర్శకేంద్రుడు అయింది అందుకే ! ఐతే ఇదంతా గతం. వయసయిపోయింది. ఆయన శరీరానికే కాదు.. మనసుకు కూడా అనినిపిస్తోందిప్పుడు ! ప్రతీ సినిమాకు తనకో ఫార్ములా ఉందంటూ ఆడియో నుంచి వెండితెర వరకు ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన రాఘవేంద్రరావులో.. ఆ స్పార్క్ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో సినిమాలు తగ్గిపోయాయ్.. కాదు కాదు అసలే లేవ్ ఇప్పుడు ! అవకాశాలు రావడం లేదు.. అవకాశం ఇస్తామని ఎవరూ అనడం లేదు.
దీంతో టాలెంట్ హంట్ అంటూ.. చివరికి యూట్యూబ్ రన్ చేస్తున్న పరిస్థితి రాఘవేంద్రరావుది ! ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రాఘవేంద్రరావు పరిస్థితి దీనాతిదీనంగా మారింది. ట్రెండ్‌ను అందుకోవడమే కాదు.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు అదే ట్రెండ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ జనరేషన్ ఆలోచనలతో పోటీ పడలేకపోతున్నారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు మాట్లాడితే చూడాలి అనుకునేవాళ్లు అంతా. అలాంటిది ఇప్పుడు ఏకంగా వివాదాల్లోకి తలదూర్చుతున్నారు.. ఆస్కార్, తమ్మారెడ్డి విషయంలో అదే జరిగింది. అలా రియాక్ట్ అవడం తప్పు కాదు.. శిష్యుడి సినిమాను వెనకేసుకురావడం తప్పు కాదు.. ఐతే ఇలాంటి వాటిపై రియాక్ట్ అయ్యేంత ఖాళీగా రాఘవేంద్రరావు ఉన్నాడన్నదే ఇక్కడ మ్యాటర్.
కొత్త ఐడియాస్ లేవ్. కొత్త కథలు రావడం లేదు. దీంతో అవకాశాలు కూడా రాఘవేంద్రరావుకు దూరంగానే ఉంటున్నాయ్. ఒకప్పుడు రాఘవేంద్రరావు డేట్ల కోసం, స్టోరీ కోసం.. నిర్మాతలు ఎదురుచూసేవాళ్లు. అలాంటిది ఇప్పుడు ఎక్కడివెళ్లినా.. ఒక్క చాన్స్.. ఒకే చాన్స్ అంటూ సినిమాల కోసం అడుక్కుంటున్నారు ఆయన ! మంచి ఐడియాలు ఉన్నాయని.. సినిమా కుదిరకపోతే వెబ్ సిరీస్ అయినా చేద్దాం పర్వాలేదు అంటూ.. తన స్థాయి నుంచి ఓ మెట్టు దిగి మరీ విన్నపాలు వినిపిస్తున్నారట పాపం. ఇదంతా చూస్తున్న, వింటున్న అభిమానుల మనస్సు చివుక్కుమంటోంది.
ఎలాంటి డైరెక్టర్ ఎలా ఐపోయాడ అంటూ భారమైన గుండెలతో.. ఓ భారమైన నిట్టూర్పు వదులుతున్నారు. అంతా కాల మహిమ. పైగా రాఘవేంద్రరావు.. టీడీపీకి అనుకూలం. దీంతో పదవుల సంగతి తర్వాత.. ఏపీ అధికార పార్టీ నుంచి కూడా కనీసం ఆహ్వానాలు కూడా అందడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలిస్తేనైనా.. దర్శకేంద్రుడుకి మళ్లీ లైఫ్ వస్తుందో.. టైమ్ మారుతుందో చూడాలి మరి !