బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు చెప్తే వణికి పోతున్నాడు. ఏ చిన్న న్యూస్ అతని గురించి వచ్చినా సల్మాన్ లో భయం పీక్స్ లో ఉంటుంది. ఒకప్పుడు ధైర్యంగా లైఫ్ ను ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సినిమా షూట్ కు వెళ్ళాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది. బిగ్ బాస్ సెట్ కు కూడా సల్మాన్ ధైర్యంగా వెళ్ళడం లేదు. సెట్ లో ఉన్న వాళ్ళను కూడా కలవడానికి సల్మాన్ ఇష్టపడలేదు. ఇక సెక్యూరిటి కూడా భారీగా ఉన్నారు. సెట్ కు ఎవరైనా రావాలి అంటే… వాళ్ళను ఓ చిన్నపాటి ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సల్మాన్ కు భద్రత కల్పించడానికి నానా ఇబ్బందులు పడుతోంది. సినిమాల షూట్ కు కూడా సల్మాన్ ఖాన్ దూరంగా ఉండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. ఇప్పుడు సికిందర్ అనే సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సినిమా షూట్ హైదరాబాద్ లో జరగగా… షూట్ జరిగినంత సేపు భారీ భద్రత కల్పించారు. తెలంగాణా పోలీసులు కూడా సల్మాన్ ఖాన్ భద్రతను చూసుకున్నారట.
ఇక ఇప్పుడు సికిందర్ షూట్ ముంబైలో స్టార్ట్ అయింది. సినిమాలో హైలెట్ సీన్స్ గా భావించే… ఓ ట్రైన్ సీన్ ను ముంబైలో షూట్ చేసారు. ముందు రైల్వే స్టేషన్ లోనే షూట్ చేయాలని భావించినా… రిస్క్ వద్దని సల్మాన్ చెప్పడంతో డైరెక్టర్… రైల్వే స్టేషన్ సెట్ వేయించాడు. రైల్వే స్టేషన్ సెట్ ను బోరివల్లి స్టూడియోలో వేయించారు. అక్కడే 30 మందితో సినిమాలో మెయిన్ సీన్ ను షూట్ చేసారు. సినిమా టీమ్, సల్మాన్ సెక్యూరిటీ టీమ్‌తో పాటు వీలైనంత తక్కువ మందితో షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఒక సీన్ కు మాత్రం భారీగా జనాలు కావాల్సి ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం దాదాపు 350 మంది జనంతో షూట్ చేయాల్సి ఉంది. జనవరి నెలాఖరు వరకు ముంబైలోని పలు లొకేషన్లలో సికిందర్ షూటింగ్ జరుగుతుందని నేషనల్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఈ చిత్రం వచ్చే ఏడాది పెద్ద ఈద్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటుగా సల్మాన్ డిసెంబర్ 7 నుండి దుబాయ్ లో ద-బాంగ్ ది టూర్ రీలోడెడ్ కోసం కూడా రెడీ అవుతున్నాడు. దుబాయ్ హార్బర్‌లో మొదటి షో ప్లాన్ చేసారు. ఇక సల్మాన్ భద్రత కోసం దుబాయ్ నుంచి బులెట్ ప్రూఫ్ కార్ ను కొంటున్న సంగతి తెలిసిందే.