Rajasab : రాజా సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత వింటేజ్ ప్ర‌భాస్‌ను చూడ‌బోతున్నామంటూ పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. డార్లింగ్ వింటేజ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో రాజాసాబ్‌గా ప్ర‌భాస్‌ను చూడాల‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి. కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజా సాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ స‌స్పెన్స్‌ను బ‌ద్ద‌లు కొడుతూ ఓ లేటెస్ట్ బ‌జ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది.

ఈ మూవీని రానున్న 2025 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో అదే రిలీజ్ కి సరైన టైమ్ అని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.. మ‌రి దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాన‌ప్ప‌టికీ.. ఫ్యాన్స్ మాత్రం ప్ర‌స్తుతానికి ఇదే నిజ‌మ‌ని ఫిక్స‌యిపోయారు.

రాజాసాబ్‌ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాజాసాబ్ స్టోరీ చాలా కొత్త‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ కథకు.. మారుతి తన స్టైల్ ఆఫ్ కామెడీని జోడించి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.. ఇక ఈ మూవీలో డార్లింగ్ లుక్‌కి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. లుంగీలో ప్రభాస్ దర్శనమిచ్చే సరికి.. మళ్లీ బుజ్జిగాడు, డార్లింగ్ రోజులకు వెళ్లిపోయారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చూడాలి మ‌రి.. రాజా సాబ్‌గా వింటేజ్ లుక్‌తో డార్లింగ్.. ఫ్యాన్స్‌కి ఎలాంటి ఇవ్వ‌బోతున్నాడో..