Prabhas : రాజా సాబ్ వ‌చ్చేది ఆ రోజేన‌ట‌..

సలార్ (Salar) తో సూపర్ హిట్ అందుకుని.. వ‌రుస భారీ ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. వ‌రుస యాక్ష‌న్ మూవీస్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ (Prabhas) .. చాలా రోజుల త‌ర్వాత మారుతి డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న రాజాసాబ్ (RajaSaab)మూవీలో డార్లింగ్ (Darling) లుక్స్‌తో అద‌ర‌గొట్టాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్ లో అసలు సిస‌లైన ప్ర‌భాస్ మాస్‌లుక్ క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది.

సలార్ (Salar) తో సూపర్ హిట్ అందుకుని.. వ‌రుస భారీ ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. వ‌రుస యాక్ష‌న్ మూవీస్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ (Prabhas) .. చాలా రోజుల త‌ర్వాత మారుతి డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న రాజాసాబ్ (RajaSaab)మూవీలో డార్లింగ్ (Darling) లుక్స్‌తో అద‌ర‌గొట్టాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్ లో అసలు సిస‌లైన ప్ర‌భాస్ మాస్‌లుక్ క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది.. ప్యాన్ ఇండియా హీరోగా విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్న ప్ర‌భాస్.. ఆ యాంగిల్‌లోనే మూవీస్‌ను సెల‌క్ట్ చేసుకుంటున్నాడు. దీంతో.. డార్లింగ్ నుంచి మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి లాంటి లోక‌ల్ ఫ్లేవ‌ర్ మూవీస్ మిస్ అవుతున్నామ‌ని ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ఈ నిరాశ‌కు తెర దించుతూ ప‌క్కా మాస్ లుక్‌తో ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు. ఇక అప్ప‌టి నుంచి యంగ్ రెబ‌ల్ స్టార్‌ను రాజాసాబ్‌గా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ చాలా ఆతుత్ర‌గా ఎదురు చూస్తున్నారు. దీంతో.. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై వ‌చ్చిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది..ఆదిపురుష్ (Adipurush), సలార్ సినిమాలతో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న ప్రభాస్ ఈ మూవీతోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తాడ‌ని భావిస్తున్నారు. డార్లింగ్ లేటెస్ట్ మూవీ స‌లార్ సెంటిమెంట్‌ను రాజాసాబ్‌తోనూ రిపీట్ చేయాల‌ని మూవీ టీం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌లార్ మూవీలాగానే ఈ మూవీని కూడా డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.. క్రిస్మ‌స్ కానుక‌గా.. డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

రాజాసాబ్ మూవీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రెబల్ ఫ్యాన్స్ అంతా డబుల్ సాటిస్ఫై అయ్యేలా సినిమా చేస్తున్నాడట మారుతి. ఇక ఈ మూవీతో మారుతి కూడా సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు. అందుకే.. రాజా సాబ్ మూవీ కోసం మారుతి చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్‌లోని మాస్ మూమెంట్స్‌తో రాజా సాబ్ చేసి గ‌ట్టి హిట్ కొట్టాల‌ని మారుతి చాలా గ‌ట్టిగా ఫిక్స‌య్యాడ‌ట‌.. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాల‌కు కొద‌వ లేన‌ప్ప‌టికీ.. మారుతి మార్క్ ఎంట‌ర్‌టైనింగ్ కూడా వేరే లెవ‌ల్‌లో ఉండేలా ప్లాన్ చేశాడ‌ట‌.. సలార్ 1 తో మాస్ హిట్ అందుకున్న ప్రభాస్ రాజా సాబ్ గా క‌చ్చితంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ ఎంటర్టైన్ మెంట్ అందిస్తాడంటున్నారు మేక‌ర్స్‌..