ఆర్ఆర్ఆర్ అమ్మ మొగుడ్ని తీస్తా, మహేష్ సినిమాలో మృగాలే

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే జక్కన్న సినిమా అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటది. సినిమా సినిమాకు ఇండియన్ సినిమాకు కొత్త పాఠాలు నేర్పుతూ జక్కన్న సినిమాలు చేస్తున్నాడు. సినిమా లేట్ అయినా పర్లా బాక్సాఫీస్ ను షేక్ చేయాలనే సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతూ ఆస్కార్ వరకు వెళ్ళాడు.

  • Written By:
  • Publish Date - October 23, 2024 / 06:54 PM IST

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే జక్కన్న సినిమా అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటది. సినిమా సినిమాకు ఇండియన్ సినిమాకు కొత్త పాఠాలు నేర్పుతూ జక్కన్న సినిమాలు చేస్తున్నాడు. సినిమా లేట్ అయినా పర్లా బాక్సాఫీస్ ను షేక్ చేయాలనే సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతూ ఆస్కార్ వరకు వెళ్ళాడు. నాకు నచ్చే వరకు సినిమాను రీ షూట్ చేస్తూనే ఉంటా అంటూ ఆర్ఆర్ఆర్ తో కూడా ప్రూవ్ చేసాడు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ జనవరిలో మొదలవుతుంది.

అమెజాన్ అడవుల్లో ఓ తెగ ఆధారంగా ఈ సినిమాను జక్కన్న యాక్షన్ అడ్వెంచర్ గా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే జక్కన్న తన టీంతో అమెజాన్ అడవులకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సినిమా షూట్ విషయంలో పక్కా లెక్కలతో ఉన్నాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు ఐ ఫీస్ట్ కాగా ఇప్పుడు వచ్చేది మాత్రం ఇండియన్ సినిమాలో ప్రతీ పార్ట్ కు విందు భోజనమే అంటున్నాడు జక్కన్న. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వెల్ సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. తన తెగకు చెందిన ఒక పాపను కాపాడటానికి ఎన్టీఆర్… పులులు, తోడేళ్ళు సహా ఎన్నో అడవి జంతువులతో ఇంగ్లీష్ వాళ్ళ ప్యాలెస్ పై దాడికి దిగుతాడు. ఆ సీన్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది కూడా ఇప్పుడు మహేష్ సినిమాలో అంతకు మించిన జంతువులను చూపిస్తా అని నాకు జంతువులు అంటే పిచ్చి అంటూ క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. దీనితో అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అనే చర్చ అప్పుడే పీక్స్ కు వెళ్లిపోయింది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో కొన్ని తప్పులు ఉన్నా… అవి ఈ సినిమాలో జరగకుండా చూస్తున్నాడు. హాలీవుడ్ లో పాగా వేయడానికి మహేష్ ను అక్కడి హీరోల మాదిరి రెడీ చేసాడు జక్కన్న. మహేష్ కూడా ఇందుకు కంప్లీట్ గా కోపరేట్ చేయడంతో జక్కన్న తన పనికి పదును పెట్టాడు. ఇక రెండేళ్ళ నుంచి కథ రాస్తున్న రచయిత విజయేంద్ర ప్రసాద్… ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ సీన్స్ ని రాసారు. అసలు తన ఆలోచన ఎలా ఉందో జక్కన్నతో పంచుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి షూట్ రెగ్యులర్ గా ఉండేలా ప్లాన్ చేసారు.