SS Rajamouli : భార్యతో రాజమౌళి డ్యాన్స్ కేక..

దర్శకత్వంలో ధీరుడైన రాజమౌళి (SS Rajamouli).. మంచి అందగాడు. హీరోగా చేయకపోయినా నటనలోనూ దిట్టే. తన సినిమాల్లోని నటీనటులకు ప్రతీ సీన్ ను దగ్గరుండి నటించి చూపిస్తుంటాడు.

దర్శకత్వంలో ధీరుడైన రాజమౌళి (SS Rajamouli).. మంచి అందగాడు. హీరోగా చేయకపోయినా నటనలోనూ దిట్టే. తన సినిమాల్లోని నటీనటులకు ప్రతీ సీన్ ను దగ్గరుండి నటించి చూపిస్తుంటాడు. ఇక.. లేటెస్ట్ గా జక్కన్న (Jakkanna) తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ ను కూడా బయటపెట్టాడు.

ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు రాజమౌళి. ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘అందరమైన ప్రేమరాణి’ పాటకు రాజమౌళి, రమా వేసిన స్టెప్పులకు అక్కడ ఆహుతులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జక్కన్న డ్యాన్స్‌ వీడియో చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ‘మీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. బాహుబలి (Baahubali), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) లాంటి హిట్ సినిమాల తరువాత SSMB29 తో బిజీగా మారాడు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది. రాజమౌళి ప్రతి సినిమాకు తన భార్య రమానే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేయనుంది. మొత్తానికి సినిమాలతోనే కాదు తన డ్యాన్స్ తో ట్రెండింగ్ లో నిలిచాడు దర్శకధీరుడు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చేలా చేశారు అంటే SSMB29 తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.