మహేశ్‌తో తీసే సినిమా నుంచి రాజమౌళి ‘ఆస్కార్ ట్యాక్స్’ వేస్తున్నాడు. ప్రొఫెషన్ ట్యాక్స్.. జిఎస్టీ సర్వీస్ టాక్స్ గురించి విన్నాం.. ఈ ఆస్కార్ ట్యాక్స్ ఏమిటనుకుంటున్నారా? రాజమౌళి సినిమా అంటే.. ఆస్కార్ ట్యాక్స్ కట్టాల్సిందే.
బాహుబలి.. బాహుబలి2 ఎంత హిట్టయినా.. ఆస్కార్‌కు వెళ్లాలనుకోలేదు కాబట్టి సరిపోయింది. దీంతో.. నిర్మాతలు బైటపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్ తీస్తున్న టైంలోగానీ.. రిలీజైనప్పుడుగానీ..ఆస్కార్‌కు వెళ్లాలన్న ఐడియా లేదు. ఎప్పుడైతే.. ఆర్‌ఆర్‌ఆర్‌కు హాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి ప్రశంసలు రావడం మొదలైందో… ఆస్కార్‌కు పంపించాలన్న ఆలోచన వచ్చింది. అప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ లెక్కలకు శుభం కార్డు పడింది. సినిమాను ఆస్కార్‌కు పంపించడానికి నిర్మాత దానయ్య ఇంట్రెస్ట్‌గా లేడని టాక్. దీంతో ఆస్కార్‌కు ఎవరు ఖర్చు పెడతారన్న ప్రశ్న తలెత్తింది.
ఆస్కార్‌కు వెళ్ళడమంటే కోట్లతో వ్యవహారం. ఆస్కార్‌కు సంబంధించిన అన్ని పనులను కొడుకు కార్తికేయ దగ్గరుంచి చూసుకున్నాడు. అందుకే ఆస్కార్ అందుకున్న కీరవాణి కార్తికేయ పేరును ప్రత్యేకంగా చెప్పాడు. ఆస్కార్ ఖర్చుపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తం రాజమౌళీనే పెట్టుకున్నాడని.. ఆర్కా మీడియా నిర్మాత శోభు యార్లగడ్డ సాయం చేశాడన్న కథనాలు వచ్చాయి. డివివి దానయ్య ప్రమేయం లేకపోవడంతోనే.. నిర్మాతగా ఆయన కనిపించలేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి.
ఒకసారి ఆస్కార్‌కు వెళితే అది అందుకునేవరకు ఎంతకష్టపడాడో గత ఆరు నెలలుగా రాజమౌళీని చూశాం. అనుకుంది సాధించాడు. అంతర్జాతీయ వేదికపై ఇండియా గర్వించేలా చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో అయిపోయిందేదో అయిపోయింది. మహేశ్ సినిమా నుంచి ఆస్కార్ ఖర్చులు నిర్మాతే భరించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చాడట. లేదంటే.. ఆస్కార్‌కు అయ్యే ఖర్చును తన రెమ్యునరేషన్‌లో కలిపి చెబుతాడట. నిర్మాతకు రెండు ఆప్షన్స్ వున్నా.. ఆస్కార్ ట్యాక్స్ కట్టాల్సిందే.
బాహుబలితో రాజమౌళీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ హాలీవుడ్ ఇమేజ్‌తోపాటు ఆస్కార్ తీసుకొచ్చింది. ఆస్కార్ టేస్ట్ ఎలా వుంటుందో చూసేశాడు. ఇలా నిన్నొదల బొమ్మాళీ అంటూ… ఆస్కార్‌ను వదిలిపెట్టడు. దాని అంతు చూసే ఏదో ఒక విభాగంలో ఆస్కార్ కొట్టేవరకు నిద్రపోడు. ఇక నుంచి జక్కన్న తీసే ప్రతి సినిమా ఆస్కార్‌కు వెళ్లాల్సిందే… నిర్మాత ఆస్కార్ ట్యాక్స్ కట్టాల్సిందే.