సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ఇంకా లాంచ్ కాలేదు. కానీ ఈలోపే కొంత షూటింగ్ అయ్యిందని ఆమద్య ఓసారి వార్తొచ్చింది. అది గాలి వార్త కాదు నిజమే అనితేలింది. కట్ చేస్తే, అసలు హీరో లేకుండా, సెట్లో తాను అడుగుపెట్టకుండా 40శాతం షూటింగ్ పూర్తయ్యిందట. ఇది మాత్రం పెద్ద షాకింగ్ న్యూసే.. అలాని ఇదేదో గాసిప్ అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఇది పక్కా న్యూస్… అసలు హీరో లేకుండా షూటింగ్ అంటే, ఏదో కొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు, పాసింగ్ షాట్లుంటాయి… కాబట్టి, ఏదో అనుకోవచ్చు. అవి సినిమా మొత్తంలో చూసినా 1 వర్సెంట్ కూడా ఉండవు.. అలాంటిది 40 శాతం మహేశ్ బాబు సినిమా షూటింగ్ అయిపోయిందంటే, అది కూడా హీరో సెట్లో అడుగుపెట్టకుండానే జరిగిపోయిందంటే, ఎవరికైనా షాకే… ఈ న్యూస్ రాగానే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ కావాలో తేల్చుకోలేకపోతున్నారు.. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు సినిమా అని సంబరపడాలా? తను లేకుండా 40శాతం సినిమా షూటింగ్ అయ్యిందంటే, సినిమాలో సూపర్ స్టార్ కనిపించేది 50శాతం సీన్లలోనేనా అని కంగారు పడాలా? ఇది వాళ్ల పరిస్థితి… ఎక్కడా షూటింగ్ జరిగినట్టు హడావిడి లేదు… అలాని ఇదేం రూమర్ కాదు… ఇంతకి ఈ న్యూస్ వెనకున్న షాకింగ్ సర్ ప్రైజ్ ఏంటో చూసేయండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీసే పాన్ వరల్డ్ మూవీ ఇంతవరకు లాంచ్ కాలేదు. మహేశ్ బాబు బర్త్ డేకి లాంచ్ కాలేదు. వినాయక చవితి వచ్చిపోయింది. దాసరా దాటేసింది. దీపావళి రాబోతోంది. అయినా ఈ సినిమా అయితే లాంచ్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. 2025 లోనే లాంచ్ అంటున్నారు
కట్ చేస్తే వారం రోజులు హీరో లేకుండానే కొన్ని సీన్లు తీశాడు రాజమౌళి. అంతా రామోజీ ఫిల్మ సిటీలోనే షూటింగ్ జరిగింది… ఇదే నిజనికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంఘటన.. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా 40శాతం షూటింగ్ పూర్తి చేశాడు రాజమౌళి. అదికూడా హీరో లేకుండానే, తను సెట్లో అడుగుపెట్కుండానే.
హీరో లేకుండా సినిమా షూటింగ్ అంటే, ఏదో ప్యాచ్ వర్క్ తాలూకు షూటింగ్ మాత్రమే చేస్తారు. కాని
హీరో లేకుండా 40శాతం షూటింగ్ అంటే ఆల్ మోస్ట్ సగం సినిమా అయిపోయినట్టే.. అయినా మూవీని లాంచ్ చేయకుండా, అలా ఎలా సగం వరకు షూటింగ్ చేస్తారనేది అందరికి వచ్చే కామన్ డౌట్..
అక్కడే ట్విస్ట్ ఉంది. ఇదేది అబద్ధం కాదు, రూమరో, గాలివార్తో అసలే కాదు. సైలెంట్ గా రాజమౌళి నిజంగానే 40 శాతం షూటింగ్ పూర్తి చేశాడు. అది కూడా హీరో లేకుండానే… కారణం ఈ మూవీ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ తో డిజైన్ చేసే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నారు
బేసిగ్గా హీరోతో సీన్లు షూట్ చేసి, తర్వాత గ్రాఫిక్స్ ని, విజువల్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేస్తారు. అందుకోసం కనీసం 2 నెల్ల నుంచి 6 నెల్ల వరకు టైం తీసుకున్నారు. కాని ఈ సారి మహేశ్ బాబు తో రాజమౌైళి ప్లాన్ చేసిన మూవీని మాత్రం రివర్స్ లోషూట్ చేస్తున్నాడు
ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ తో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ని రెడీ చేసి, వాటికనుగునంగా యాక్షన్ సీన్లు, మిగతా షూటింగ్ ప్లాన్ చేశారట. అంటే గ్రీన్ మ్యాట్ లో హీరో కదిలివస్తుంటే, కెమెరాలో మాత్రం ఆల్రెడీ యాడ్ చేసిన గ్రాఫిక్స్ తాలూకు టూల్స్ వల్ల, షూటింగ్ టైంలోనే గ్రాఫిక్స్ తో సహా ప్రివ్యూ చూసే ఛాన్స్ ఉంది. ఆతర్వాత కరెక్షన్స్ ని పోస్ట్ ప్రొడక్షన్ లోయాడ్ చేస్తారు. దీని వల్ల టైం ఆదా అవటమే కాదు, షూటింగ్ టైంలో మిస్టేక్స్ కాకుండా, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ వస్తాయి.. అందుకే హీరో లేకుండా తన ప్లేస్ లో డూప్ ని పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ ని రెడీ చేశారు. 40శాతం వరకు ఈ పనులు పూర్తయ్యాయి.. ఇలానే సినిమా పూర్తైతే, హాలీవుడ్ తర్వాత ఓ సినిమా మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ నివాడి, చాలా పాత్రలను గ్రాఫిక్స్ లో యాడ్ చేసిన తొలి ఇండియన్ మూవీగా చరిత్ర స్రుష్టించబోతోంది సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ.