ఇదెక్కడి సర్ ప్రైజ్… సైలెంట్ గా షూటింగ్ తో బీభత్సం..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా షూటింగ్ మొదలైంది. ఇది నిజంగా నిజం... ఇంతవరకు సినిమాను లాంచ్ చేయలేదు. ఎక్కడా లాంచింగ్ డేట్ ఇవ్వలేదు.

  • Written By:
  • Publish Date - September 25, 2024 / 08:47 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా షూటింగ్ మొదలైంది. ఇది నిజంగా నిజం… ఇంతవరకు సినిమాను లాంచ్ చేయలేదు. ఎక్కడా లాంచింగ్ డేట్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న సీఎం రీలీఫ్ ఫండ్ ఇస్తూ మహేశ్ బాబు తన లుక్ ని రివీల్ చేస్తే, అసలిది రాజమౌళి సినిమాకోసం రెడీ చేసిన లుక్ కాదన్నారు. జీసెస్ లా మహేశ్ బాబు కనిపిస్తున్నాడంటూ మరో యాంగిల్ లో పొగుడుతూ ట్రోల్ చేశారు.. ఇవన్నీ జరుగుతున్న టైంలో సడన్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా సినిమా షూటింగ్ నే మొదలు పెట్టాడు రాజమౌలి.. కాకపోతే ఇక్కడే కథ లో చిన్న ట్విస్ట్ ఉంది.. అదేంటి? ఏం జరగుతోంది?

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాను ఎవరు ప్లాన్ చేసినా షూటింగ్ మొదలైందంటే, ఆ హడావిడినే వేరు. అలాంటిది త్రిబుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు సినిమా అంటే, టాలీవుడ్ లోనే కాదు, ఎంటైర్ పాన్ ఇండియా లెవల్లో ఆ హడావిడే ఓరేంజ్ లో ఉంది..

కాని అసలు ఎలాంటి చడీ చప్పుడు లేకుండా మహేశ్ బాబు సినిమా షూటింగ్ రామోజీ రావు ఫిల్మ్ సిటీలో
మొదైలైంది. ఏకంగా ఫైట్ సీన్ నే షూట్ చేస్తూ రాజమౌళి సర్ ప్రైజింగ్ షాక్ ఇస్తున్నాడు. కాకపోతే ఈ షూటింగ్ లో మహేశ్ బాబు జాయిన్ కాలేదు..

అంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫౌజీ మూవీ ప్లాన్ చేసిన హను రాఘవపూడీ స్టైల్లోనే రాజమౌళి, హీరో లేకుండా సినిమా షూటింగ్ మొదలు పెట్టాడా అంటే అదికూడా నిజం కాదు. హీరో లేని సీన్లను ముందు తీసి, తర్వాత హీరోతో అసలు సీన్లు తీసే పద్దతి చాలా మంది ఫాలో అవుతున్నారు. అలాంటిదేం రాజమౌళి చేయట్లేదు..

అచ్చంగా హీరో ఉండే సీన్ షూటింగ్ తోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు. అసలు ఈ సినిమాను ఇంతవరకు లాంచ్ చేయలేదు. అలాంటప్పుడు అలా ఎలా రెగ్యలర్ షూటింగ్ మొదలు పెడతాడంటే, నిజంగా ఇది నిజం షూటింగ్ కాదు. కేవలం డమ్మీ షూటింగ్ .పుష్ప 2 క్లైమాక్స్ ని ఎలాగైతే డూబ్స్ ని పెట్టి డమ్మీ షూటింగ్ తీశాక, ఔట్ పుట్ చూసి ఇప్పుడు అసలు షూటింగ్ చేస్తున్నారో, అలాంటి ప్రయత్నమే రాజమౌళి చేస్తున్నాడు… ఓ ఫైట్ సీన్ ని గ్రీన్ మ్యాట్ లో డూబ్స్ తో డమ్మీ షూట్ చేసి, టెక్నికల్ గా గ్రాఫిక్స్ సూపర్ వైజర్ నుంచి ఏం కావాలి, అన్న విషయంలో క్లారిటీ కోసమే ఈ డమ్మీ సూట్ చేస్తున్నారట.