Rajamouli: మహేశ్ సినిమా కోసం.. హాలీవుడ్ ని పరుగులు తీయిస్తున్న రాజమౌళి

వెయ్యి కోట్లతో తెరకెక్కనున్న మహేశ్ బాబు సినిమా, ఇంకా పట్టాలెక్కకముందే పాన్ వరల్డ్ మార్కెట్ పనులు మొదలు పెట్టాడు జక్కన్న.. ఇది నిజంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూసే..!

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 06:04 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా హాలీవుడ్ రేంజ్ లో గ్రాండ్ గా తెరకెక్కబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వైపు వచ్చనేల 12 ఆస్కార్ అవార్డులు వేడుక, మరోవైపు మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు డీల్ రెండూ చక్క బెట్టేందుకు జక్కన్న యూఎస్ ప్లాన్ రెడీ చేశాడు

నెట్ ఫ్లిక్స్ యజమానితో రాజమౌళి మీటింగ్ అనగానే, ఇది మహేశ్ బాబు సినిమా కోసం బడ్జెట్ తో పాటు ప్రమోషన్ ని, డిస్ట్రిబ్యూషన్ న్ రైట్స్ గురించి చర్చించటానికే అన్నారు.

మరోవైపు జురాసిక్ పార్క్ లాంటి సినిమాలుతీసిన స్పిల్ బర్గ్ ని, అలానే అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరున్ ని జనవరి 14 న కలవబోతున్నాడు రాజమౌళి. స్పిల్ బర్గ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ , అలానే కామెరున్ సంస్థ ఈరెండు అమెరికా, యూరప్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో జక్కన్నతో డీల్ కుదుర్చుకుంటున్నాయట.

సో వెయ్యి కోట్లతో తెరకెక్కనున్న మహేశ్ బాబు సినిమా, ఇంకా పట్టాలెక్కకముందే పాన్ వరల్డ్ మార్కెట్ పనులు మొదలు పెట్టాడు జక్కన్న.. ఇది నిజంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూసే..